లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

అహ్మద్ పటేల్ ఆరోగ్యం విషమం.. ICUకు తరలింపు

Published

on

Ahmed Patel Moved To ICU : కరోనా బారినపడిన సీనియర్ కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్‌ను ఐసీయూకు తరలించినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. గుర్గావ్‌లోని మేదాంత ఆస్పత్రిలో అహ్మద్ చికిత్స పొందుతున్నారు.కరోనా సోకిన పటేల్.. అక్టోబర్ 1 నుంచి ఇదే ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం కొంచెం సీరియస్‌గా ఉండటంతో ఐసీయూలోకి షిప్ట్ చేసినట్టు సమాచారం.

సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోందని ఆయన కుమారుడు పైశాల్ పటేల్ ట్వీట్ చేశారు.కొన్ని వారాల క్రితం అహ్మద్ పటేల్‌కు కరోనా సోకింది. వెంటనే ఆయన తనకు తాను ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత మేదాంత ఆస్పత్రిలో చేరిన ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఐసీయూలోకి తరలించారు.

ప్రస్తుతం పటేల్ ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యులు పర్యవేక్షణ కొనసాగుతోందని, త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థించాలని కోరుతున్నాం’ అని పైశాల్ పటేల్ తెలిపారు.71ఏళ్ల పటేల్ తొందరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నామని కాంగ్రెస్ నేతలైన ఆనంద్ శర్మ, శశీ థరూర్ ట్విట్టర్ వేదికగా ఆకాంక్షించారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *