లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

కాంగ్రెస్‌లో కొత్త మార్పు: లోక్ సభ, రాజ్యసభలో సీనియర్లకు ప్రాధాన్యత తగ్గించిన కాంగ్రెస్, యువనేతలకు బాధ్యతలు

Published

on

పార్టీని ప్రక్షాళన చేయాలని కోరుతూ..సీనియర్లు రాసిన లేఖపై సోనియా గాంధీ ఇంకా సీరియస్ గానే ఉన్నట్లు కనిపిస్తోంది. వారికి చెక్ పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటుండడం ప్రాధాన్యత సంతరించుకొంటోంది. లోక్ సభ, రాజ్యసభలో వారి ప్రాధాన్యతను తగ్గించి వేయడం ఆ పార్టీలో హాట్ టాపిక్ అయ్యింది.రెండు వేర్వేరు సమన్వయ కమిటీలు వేశారు. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ గా సీనియర్ నాయకుడు జైరాం రమేష్ ను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. పార్టీ సమన్వయం కోసం జైరాంతో పాటు..తన రాజకీయ సలహాదారైన అహ్మద్ పటేల్, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో పాటు కమిటీ ఏర్పాటు చేశారు.

62 ఏళ్ల వయసులో 62 కిలోమీటర్లు పరిగెత్తి ’బర్త్ డే సెలబ్రేషన్’


అందులోనే రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న గులాం నబీ ఆజద్, ఉప నేతగా ఉన్న ఆనంద్ శర్మలను సభ్యులుగా చేర్చారు. దీనిని బట్టి చూస్తే…వీరి ప్రాధాన్యతను తగ్గించినట్లైంది.
అంతేగాకుండా..లోక్ సభలో సీనియర్ నేతలైన మనీష్ తివారీ, శశి థరూర్ ప్రాధాన్యతను తగ్గస్తూ…అక్కడ ఉప నేత బాధ్యతలను అసోం యంగ్ లీడర్ గౌరవ్ గొగొయ్ కి అప్పగించారు.విప్ గా పంజాబ్ లోని లుథియానా లోక్ సభ సభ్యుడు రవ్ నీత్ సింగ్ బిట్టును నియమించారు. గౌరవ్ గొగొయ్ మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ కుమారుడు కాగా, రవ్ నీత్ సింగ్ బిట్టు పంజాబ్ ముఖ్యమంత్రి సర్దార్ బియాంత్ సింగ్ మనువడు. ఈ యంగ్ లీడర్స్ యూత్ కాంగ్రెస్ నుంచి రాజకీయంగా ఎదిగారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *