Home » కాంగ్రెస్ లో అంతేగా : టికెట్ ఇవ్వలేదని.. పార్టీ ఆఫీస్ సామాను ఎత్తుకెళ్లిన ఎమ్మెల్యే
Published
2 years agoon
By
vamsiమహారాష్ట్రలో తనకు టిక్కెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఔరంగాబాద్ లోక్‌సభ సీటు ఆశించిన సిల్లోడ్ ఎమ్మెల్యే అబ్దుల్ సత్తార్.. టిక్కట్ రాకపోవడంతో ఆగ్రహంతో తన అనుచరులతో కలిసి గాంధీ భవన్‌కు వెళ్లి కుర్చీలను పట్టుకెళ్లాడు. అబ్దుల్ సత్తార్ తన డబ్బులతో కుర్చీలు తెచ్చిన కారణంగానే తన 300కుర్చీలను తీసుకెళ్లినట్లు వెల్లడించారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సత్తార్ ప్రకటించారు.
Read Also : 20రోజులు ఓపిక పడితే : మనందరి ప్రభుత్వం వస్తుంది
సత్తార్ కుర్చీలు ఎత్తుకుని పోతున్న సమయంలోనే కాంగ్రెస్, ఎన్సీపీ మీటింగ్ జరగగా.. కుర్చీలు లేకపోవడంతో మీటింగ్‌ను ఎన్సీపీ ఆఫీసుకు మార్చుకున్నారు. అబ్దుల్ సత్తార్ స్థానికంగా మంచి పట్టున్న నేత. అయితే కాంగ్రెస్ మాత్రం సత్తార్ ఆశించిన పార్లమెంట్ టిక్కెట్‌ను ఎమ్మెల్సీ సుభాష్ జంబాద్‌కు ఇచ్చింది. సత్తార్ కుర్చీలకు ఎత్తుకుపోవడంపై మాట్లాడిన సుభాష్ జంబాద్.. సత్తార్ రాజీనామాను కాంగ్రెస్ ఆమోదించలేదని, ఇంకా ఆయన పార్టీలోనే ఉన్నాడని, అవసరం వచ్చి కుర్చీలను తీసుకుని వెళ్లి ఉండచ్చునని అన్నారు.