గ్రేటర్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్…ఐదు పార్లమెంట్ స్థానాలకు కమిటీలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

GHMC Elections Congress Focus : గ్రేటర్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో పరాభవం తర్వాత బల్దియాలో పూర్వవైభవం కోసం సర్వ శక్తులు ఒడ్డాలని ప్రయత్నిస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఐదుగురు సభ్యులతో ఎన్నికల కమిటీలను నియమించింది. ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒక్కొక్క పీసీసీ కో-ఆర్డినేటర్లను కేటాయించారు. ఈ మేరకు మంగళవారం (నవంబర్ 17, 2020) టీపీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.మూడు పార్లమెంట్ స్థానాలకు ఐదుగురు చొప్పున సభ్యులు, రెండు పార్లమెంట్ స్థానాలకు ఆరుగురు చొప్పున సభ్యులను నియమించారు. సాయంత్రం ఎలక్షన్ మేనేజ్ మెంట్, ప్లానింగ్ కమిటీ ప్రకటన చేయనున్నారు. సికింద్రాబాద్-చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో మాత్రం ఆరుగురు సభ్యులను నియమించింది. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో విజయశాంతికి కూడా ఎన్నికల బాధ్యతలు అప్పగించారు.


గ్రేటర్ ఎన్నికలపై దాఖలైన పిటిషన్ ను అత్యవసరంగా విచారించేందుకు హైకోర్టు నిరాకరణ


ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు చేసిన కాంగ్రెస్ ..ఈనెల 21న మేనిఫెస్టోను విడుదల చేయాలని నిర్ణయించింది. గ్రేటర్ లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. రేపటి లోగా అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. ఈనెల 18న అభ్యర్థులకు బీఫామ్స్ అందించనుంది. ఇవాళ గాంధీ భవన్ లో ఎన్నికల కమిటీలు సమావేశం నిర్వహించనుంది.

Related Tags :

Related Posts :