Home » బెంగళూరులో కాంగ్రెస్ భారీ ర్యాలీ.. డీకే శివకుమార్, సిద్ధరామయ్య అరెస్టు
Published
1 month agoon
Congress rally : బెంగళూరులో కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు కదం తొక్కారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిరసిస్తూ..భారీ ర్యాలీ చేపట్టారు. వేలాది సంఖ్యలో కార్యకర్తలు, రైతులను కాంగ్రెస్ సమీకరించింది. సిటీ రైల్వే స్టేషన్ వద్ద 2021, జనవరి 21వ తేదీ గురువారం ఉదయం సమావేశమయ్యారు. అనంతరం ఫ్రీడమ్ పార్కు వైపు మూడు కిలోమీటర్ల మేర కవాతు చేశారు. ఎన్డీయే ప్రభుత్వానికి తమ నిరసనను తెలియచేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం రాజ్ భవన్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. రాజ్ భవన్ సమీపంలోకి రాకుండా..భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. వారిని నిరోధించారు. బారికేడ్లను తోసుకుని రాజ్‌భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వందలాది మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. కేఎస్ఆర్టీసీ బస్సులోకి ఎక్కించి అక్కడ్నించి తరలించారు. అదుపులోకి తీసుకున్న వారిలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డి.కె.శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య ఉన్నారు.
అంతకుముందు…ఫ్రీడమ్ పార్కులో నిర్వహించిన బహిరంగసభలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రసంగించారు. ఇది కేవలం పార్టీ కార్యక్రమం కాదని, రాష్ట్రం, దేశం, రైతుల గొంతుక అని శివకుమార్ వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో ఇలాంటి నిరసనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపన లబ్ది పొందిన వారి పేర్లను ప్రచురించాలని తాను కోరుతున్నట్లు, కేంద్ర ప్రభుత్వం కేవలం పెద్ద సంస్థల కోసమే పని చేస్తుందని విమర్శించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని తొలగించాలని దేశ రైతులు నిర్ణయం తీసుకున్నారని, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దేశం మొత్తం కోరుతున్నా…రైతులకు ఎందుకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని సిద్ధరామయ్య మండిపడ్డారు. రాష్ట్రంలోని యడియూరప్ప ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని, రాజ్యాంగం కల్పించిన విధంగా రైతులు శాంతియుత ప్రదర్శనలు చేస్తుంటే వారిపై పోలీసులను ప్రభుత్వం ఉసిగొలుపుతోందని విమర్శించారు. వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం ప్రభుత్వ పనితీరుకు మచ్చగా ఆయన అభివర్ణించారు. ఈ చట్టాలు రైతుల మేలు చేకూరుతుందని అనిపిస్తే..సుప్రీంకోర్టు ఎందుకు నిలిపివేసిందని ప్రశ్నించారు.
ఆజాద్ కు వ్యతిరేకంగా జమ్మూలో కాంగ్రెస్ నిరసన
ప్రశాంత్ కిశోర్‌కు కేబినెట్ హోదా.. రూపాయే జీతం!
ఆరోపణలు నిరూపించు..అమిత్ షాకు నారాయణస్వామి సవాల్
మనసెరిగిన మాస్టారు.. విద్యార్థి కోసం బార్బర్‌గా మారిన ప్రిన్సిపల్, స్కూల్లోనే హెయిర్ కట్
ప్రధాని మోడీపై ఆజాద్ ప్రశంసలు
కాంగ్రెస్ లో జీ-23 టెన్షన్..”జమ్మూ సమావేశం” పార్టీలో చీలికలు తెస్తుందా?