అమెరికా చట్టసభలో దివాళీ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ సభ్యులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Diwali resolution in US House : అమెరికాలో దివాళీ పండుగను పురస్కరించుకుని అమెరికా అత్యున్నత చట్టసభ సభ్యులు భారతీయ అమెరికన్లకు దివాళీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చట్టసభలో కాంగ్రెస్ సభ్యులు రాజక్రిష్ణమూర్తి దివాళీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.వెలుగులు విరజిమ్మే దీపావళి పండుగ చారిత్రక విశిష్టతను సభలోని చట్టసభ్యులు కూడా ఆమోదం తెలపడంతో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా శనివారం ప్రతిఒక్కరూ దివాళీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.అమెరికాలో నాలుగు మిలియన్ల మంది భారతీయ అమెరికన్ హిందువులు, సిక్కులు, జైనులు దివాళీ పండుగ వేడుకలను జరుపుకుంటున్నారు. చెడు అనే చీకటిని పారద్రోలుతూ వెలుగులు నింపే ఆధ్యాత్మిక విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు.అమెరికావ్యాప్తంగా భారతీయ అమెరికన్ కమ్యూనిటీలకు దీపావళి సెలబ్రేషన్ చేసుకోవడానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. చారిత్రక విశిష్టత కలిగిన దివాళీని గుర్తిస్తూ చట్టసభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.భారతదేశం, అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఈ తీర్మానాన్ని తీసుకొచ్చినట్టు క్రిష్ణమూర్తి తెలిపారు.

మహమ్మారి సమయంలో ఏడాదంతా సెలవులతోనే గడిపేశామని.. దివాళీ పండుగ వేడుకలు కాస్తా భిన్నంగా ఉంటాయని సెనేటర్ జాన్ క్రానిన్ అన్నారు.
మొన్నటివరకూ ఐసోలేషన్ లో గడిపినవారంతా దివాళీ వేడుకలతో పెద్ద సంఖ్యలో కలిసి పండుగ వేడుకలను జరుపుకునేందుకు సరైన వేదికగా జాన్ చెప్పారు.

Related Tags :

Related Posts :