లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

రైతుల ఉద్యమం వెనుక చైనా, పాకిస్తాన్ కుట్ర ఉంది: కేంద్ర మంత్రి

Published

on

China Pakistan:కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న రైతుల నిరసనల వెనుక చైనా, పాకిస్తాన్ దేశాల హస్తం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి రావు సాహెబ్ డాన్వే.

సవరించిన పౌరసత్వ చట్టం(CAA) మరియు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) చట్టాల విషయంలో కూడా గతలంలో ముస్లింలను తప్పుదారి పట్టించారని, అప్పడు అవి విజయవంతం కాలేదని అన్నారు.కొత్త చట్టాల వల్ల నష్టపోతారని ఇప్పుడు రైతులకు చెబుతున్నారని ఆరోపించారు. ‘‘ఇదేమీ రైతుల ఉద్యమం కాదని, వీటి వెనుక పాకిస్తాన్, చైనాలు ఉన్నాయని ఆరోపించారు. NRC, CAA చట్టాలు వస్తే ఆరు నెలల్లోగా మిమ్మల్ని తరిమేస్తారు అంటూ అప్పట్లో ముస్లింలను భయపెట్టారని, ఒక్క ముస్లింనైనా వెళ్లగొట్టామా?” అని ప్రశ్నించారు. రైతుల విషయంలో కూడా ప్రస్తుతం అలాంటి పుకార్లే నడుస్తున్నాయని ఆయన అన్నారు.రైతు ఉద్యమం అనేది ఇతర దేశాల కుట్ర. రైతుల వ్యతిరేకత వెనుక రెండు పొరుగు దేశాలు ఉన్నాయని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతుల ప్రధాని అని, ఆయన నిర్ణయాలు రైతులకు వ్యతిరేకంగా ఉండవని దన్వే చెప్పుకొచ్చారు.

అయితే దన్వే చేసిన వ్యాఖ్యలపై శివసేన నాయకుడు సంజయ్ రౌత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతు ఉద్యమం వెనుక చైనా, పాకిస్తాన్ హస్తం ఉందని కేంద్ర మంత్రికి తెలిస్తే, రక్షణ మంత్రి వెంటనే చైనాకు వెళ్లాలని, దీనిపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ విషయంలో పాకిస్తాన్‌పై వెంటనే సర్జికల్ స్ట్రైక్ చేయాలని, రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి, సాయుధ దళాల ముఖ్యులు ఈ విషయంపై తీవ్రంగా చర్చించాలని అభిప్రాయపడ్డారు.