పోలీస్ స్టేషన్ లో కలకలం : SI రివాల్వర్ తో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

పోలీస్ స్టేషన్ లో కలకలం : SI రివాల్వర్ తో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్ లో కలకలం రేగింది. హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయాడు. మృతుడిని హెడ్

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్ లో కలకలం రేగింది. హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయాడు. మృతుడిని హెడ్ కానిస్టేబుల్ ప్రకాశ్ రెడ్డి గా గుర్తించారు. ఓ కేసు విషయంలో ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ ప్రకాశ్ మద్య వివాదం జరిగినట్టు తెలుస్తోంది. దీంతో ఆవేశానికి లోనైన హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. పోలీస్ స్టేషన్ లోనే హెడ్ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్న ఘటన డిపార్ట్ మెంటులో సంచలనంగా మారింది. పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. సీపీ కార్తికేయ ఇందల్వాయి పీఎస్ కి చేరుకుని విచారణ చేపట్టారు. అసలేం జరిగిందో వివరాలు తెలుసుకుంటున్నారు.

Related Posts