Container, Car Collision

శుభకార్యానికని వెళ్లి మృత్యు ఒడిలోకి..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

చిత్తూరు జిల్లా ములకలచెరువు గ్రామానికి చెందిన ఏడుగురు కారులో తూర్పుగోదావరి జిల్లా యర్రవరంలో ఓ శుభకార్యానికి  వెల్లి తిరిగి వస్తుండ‌గా. చెన్నై-కోల్‌కతా 16వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

గుంటూరు: ఓ శుభకార్యానికి  వెల్లి తిరిగి వస్తుండ‌గా..జ‌రిగిన రోడ్డు ప్రమాదంలో న‌లుగురు మృతి చెందారు. చిత్తూరు జిల్లా ములకలచెరువు గ్రామానికి చెందిన ఏడుగురు కారులో ఓ శుభకార్యాలనికని వెళ్లారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా యర్రవరంలోని  చెన్నై-కోల్‌కతా 16వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.  యడ్లపాడు మండలం వ‌ద్ద వీరు ప్రయాణిస్తున్న కారుకు ముందు వెళ్తున్న కంటైనర్‌ను మితిమీరిన వేగంతో ఢీకొట్టటంతో ఈ ప్రమాదం జరిగింది.  మొదట కంటైనర్ ను ఢీకొన్ని కారు తరువాత  డివైడర్ ను ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యల్ని చేపట్టారు. గాయపడిన ఏడుగురిని గుంటూరు ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతున్న ఏడుగురిలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో కారు డ్రైవర్‌తో పాటు బాలుడు,ఇద్ద‌రు మహిళలు ఉన్నారు. చికిత్స పొందుతున్న ఆ ముగ్గురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.  ఈ  సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Related Posts