be carefull with seasonal diseases

సీజనల్ వ్యాధులతో తస్మాత్…!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రతి సీజన్‌లోనూ రకరకాల వ్యాధులు ప్రజల ప్రాణాలను అరచేతపట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ప్రస్తుతం వర్షాలతో కొత్త నీరు రావడం, కొన్ని చోట్ల నిలువ ఉండటం, వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం, పారిశుధ్యం తదితర కారణాలతో వ్యాధులు ప్రబలుతున్నాయి. అలాగే ఆహారం, మంచి నీరు, దోమలు, ఈగల వల్ల కూడా అనేక వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఆహారం పరిశుభ్రత లోపిస్తే అతిసార, జాండీస్, టైఫాయిడ్‌, మంచినీరు, పరిశుభ్రత లోపిస్తే అతిసార, కలరా, టైఫాయిడ్‌, దోమ కాటుతో మలేరియా, డెంగ్యూ, ఈగలతో టైఫాయిడ్‌, ఇతర అంటువ్యాధులు, అనూహ్యంగా స్వైన్‌ఫ్లూ వంటి భయంకర వ్యాధులు పేషెంట్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రజలను ఏలుతున్న వారు విఫలమవుతున్నారు. ఫలితంగా ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.. 
జలుబు… దగ్గు…

వర్షాకాలం వస్తే చాలు అప్పటివరకూ ఎక్కడ వుంటుందో తెలియదు కాని ఒక్కసారిగా వచ్చి పట్టేస్తుంది జలుబు. పెద్దవాళ్లయితే ఏదో విధంగా తట్టుకుంటారు కాని పిల్లలు నీరసించిపోతారు. ఒకరి నుంచి ఒకరికి వెంటనే వ్యాపించే ఈ జలుబు, దగ్గు, గొంతు ఇన్‌ఫెక్షన్ సమస్యలకు కొన్ని నివారణ సూచనలు.
జలుబు, జ్వరం లక్షణాలు కనిపించగానే ఎక్కువ హానికరం కాని పారాసిటమాల్ టాబ్లెట్‌లు వాడవచ్చు. జలుబు పూర్తిగా దారికి వచ్చే వరకు రోజుకు మూడుసార్లు వేడి నీళ్లలో ఉప్పు వేసుకొని పుక్కిటపట్టాలి.
రోజులో కనీసం మూడుసార్లయినా పసుపు లేదా, అదుబాటులో ఉండే జండూబామ్ వేసుకుని ఆవిరి పడితే జలుబు త్వరగా తగ్గడంతో పాటు గొప్ప రిలీఫ్ వస్తుంది.
ఈ సీజన్‌లో నీళ్ల నుంచి అనేక జబ్బులు వ్యాపిస్తాయి. కాబట్టి పిల్లలు, పెద్దలు అందరూ దాకా కాచి, వడపోసిన నీళ్లు మాత్రమే తాగితే మంచిది.
నిమ్మపండు ఈ సీజన్‌లో వచ్చే జలుబు లక్షణాలను త్వరగా తగ్గిస్తుంది. వేడి నీళ్లలో నిమ్మరసం, కాస్త తేనె కలుపుకొని రోజుకు రెండు సార్లు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జబ్బు నుంచి త్వరగా ఉపసమనం పొందుతారు.
మిరియాలు, వెల్లుల్లి, అల్లం.. ఇవన్నీ కూడా ముక్కు దిబ్బడను తగ్గించడంతో పాటు, జలుబు చేసిన సమయంలో రిలీఫ్‌గా ఉండేందుకు తోడ్పడతాయి.
జలుబు తీవ్రంగా ఉన్నప్పుడు పిల్లల ఛాతీపై ఆవనూనెకు వెల్లుల్లి కలిపి మసాజ్ చేయాలి. చిన్నారి ఛాతీపైనా, మెడ, వీపు భాగాల్లోనూ మెల్లగా మసాజ్ చేయాలి.
శరీరానికి మంచినీరు ఎంతో అవసరం. పిల్లలు జలుబుతో బాధపడుతున్నప్పుడు వారికి ఎక్కువ సార్లు మంచినీరు తాగించాలి. అప్పుడు శరీరం వ్యాధితో సమర్థంగా పోరాడగలదు. కోల్పోయిన నీటి శాతం వెంటనే భర్తీ అవుతుంది.

READ  ఈ పండు తినండి..రోగ నిరోధక శక్తి పెంచుకోండి

డెంగీ ఫీవర్…

సీజనల్‌ ఫీవర్స్ జనం ప్రాణాలు తీస్తున్నాయి. పల్లే, పట్టణం తేడాలేకుండా జనం జ్వరాల బారీన పడి మూలుగుతున్నాయి. మలేరియా, టైఫాయిడ్‌తో పాటు డెంగ్యూ జ్వరాలు విజృభింస్తున్నాయి. ప్రభుత్వ , ప్రైవేటు అనే తేడా లేకుండా ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. ప్రత్యేకంగా డెంగ్యూ అనగానే సామాన్యుడికి వణుకు పడుతుంది. అంటువ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైనది డెంగ్యూ. డెంగ్యూ కేసులు రోజురోజుకి డెంగ్యూ కేసులు పెరిగుతున్నాయి. ఎడిస్‌ ఎజిప్టై దోమ కుట్టడం వల్ల ఈ వైరస్ ప్రబలుతోంది. డెంగ్యూ వ్యాధి వచ్చిన రోగిని కుట్టిన దోమ… మరొకరిని కుట్టినా ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. డెంగ్యూ ప్రస్తుతం వేగంగా వ్యాపిస్తుండటం వల్ల.. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరు తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే.. సమస్యను ముందుగానే తెలుసుకుని.. మందులు తీసుకుంటే.. ప్రమాదం నుంచి బయటపడవచ్చు. డెంగ్యూ లక్షణాలు అందరికి ఒకేలా ఉండవు. కాబట్టి ఏ మాత్రం అనుమానం వచ్చినా.. వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది. ఇంతకీ డెంగ్యూ సోకినప్పుడు సాధారణంగా కనిపించే లక్షణాలేంటో ఒకసారి చూద్దాం..

వ్యాధి లక్షణాలు…..
– ఉన్నట్టుండి జ్వరం అధికంగా వస్తుంది.
– తలనొప్పి అధికంగా ఉంటుంది.
– కంటిలోపల నొప్పి వచ్చి కంటి కదలికలను తగ్గుతాయి. శ్రీ కన్ను కదిలినప్పుడు నొప్పి ఎక్కువ అవుతుంది.
– కండరాలు, కీళ్ల నొప్పులు.
– వాంతి అవుతున్నట్లు అనిపిస్తుంది.
– నోరు(డీహైడ్రేషన్) ఎండిపోతుంది. దాహం ఎక్కువగా అవుతుంది.
– ప్లేట్ల టెల్స్ కౌంట్ తగ్గిపోవడం…
– లో బీపీ, చర్మంపై దద్దుర్లు, పొట్టలో వికారంగా ఉండటం,
పై లక్షణాలు ఏ ఒక్కటి కలిగి ఉన్నా వెంటనే సమీపంలోని ఆసుపత్రిలో చూయించుకోవాలి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. డెంగ్యూ నివారణకు ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏదీ లేదు. వెంటనే స్పందించి జ్వర తీవ్రతను గుర్తించి చికిత్స తీసుకోవాలి.

వ్యక్తిగతంగా జాగ్రత్తలు పాటించాలి….
దోమతెరలు, నివారణ మందులు వాడి దోమ కాటు నుండి విముక్తి పొందవచ్చు. పొడుగు ప్యాంట్లు, పొడుగు చేతులు గల చొక్కాలు ధరించాలి. అన్ని భాగాలు రక్షణ కలిగే విధంగా వేసుకోవాలి.పిల్లలకు శరీర భాగాలు పూర్తిగా కప్పేటట్లు దుస్తులు వేయాలి. సొంత చికిత్స చేయకూడదు. ఆస్ప్రిన్‌, బ్రూఫెన్‌, కాంబిఫ్లామ్‌, అనాలజిన్‌ లాంటి మాత్రలు తీసుకోకూడదు. జ్వరం వచ్చినట్లు అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Related Posts