BSNL 4G services to be launched soon  | 10TV

కమింగ్ సూన్ : బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

హైదరాబాద్ : సెల్ ఫోన్ రంగంలో టెలికాం కంపెనీల మధ్య కాంపిటీషన్ వార్ నిత్యం కొనసాగుతూ ఉంటుంది. ప్రైవేటు కంపెనీలతో బీఎస్ఎన్ఎల్ పోటీ పడుతోంది. వినియోగదారులను ఆకర్షించడం కోసం పలు ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. 4 జీ సేవల్లో ప్రైవేటు కంపెనీలు దూసుకపోతుండడంతో…తాము కూడా ముందుకు సాగాలని బీఎస్ఎన్ఎల్ నిర్ణయించింది. తమ వద్ద ఉన్న కస్టమర్లు ఇతర నెట్ వర్క్‌ల వైపు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా 4 జీ సేవలు త్వరలోనే అందుబాటులోకి తేవాలని బీఎస్ఎన్ఎల్ నిర్ణయం తీసుకుంది. ఈ ఏర్పాట్లలో అధికారులు బిజీ బిజీగా ఉన్నారు. 

రూ. 123 కోట్లతో…
సుమారు రూ. 123 కోట్ల ఖర్చుతో 2జీ, 3జీ నెట్ వర్క్‌‌ ఉన్న ప్రాంతాల్లో సేవలను అప్‌గ్రేడ్ చేయనున్నారు. జనవరి 1వ తేదీన జరిగిన మీడియా సమావేశంలో వివరాలను బీఎస్ఎన్ఎల్ సీజీఎం సుందరం వెల్లడించారు. హైదరాబాద్‌ – రంగారెడ్డి జిల్లాలు మినహా అన్ని జిల్లా కేంద్రాలతో పాటు ముఖ్య పట్టణాల్లో కలిపి 40 చోట్ల 409 4జీ టవర్స్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

పలు ఆఫర్స్…
బీఎస్ఎన్ఎల్ 487 స్పాట్స్ ఏర్పాటు చేయడం జరిగినట్లు…మిగిలిన 423 స్పాట్స్‌లను ఫిబ్రవరి నాటికి ఏర్పాటు చేస్తామన్నారు. ఇక వినియోగదారుల కోసం కొత్త కొత్త ప్లాన్లు అమల్లోకి తెచ్చినట్లు చెప్పారు.  వార్షిక – 1,699, వార్షిక ప్లస్‌ – 2009, పది శాతం అదనపు టాక్‌ టైమ్, ప్రమోషనల్‌ ఎస్‌టీవీ, అదనపు డేటా ఆఫర్స్‌ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. 

Related Posts