Bumper Offer, Home Jobs, Vermont State of US, America Own houses, US IT companies

ఇల్లు, ఉద్యోగం, అన్నీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా అన్ని సౌకర్యాలు ఉన్నా ఆ రాష్ట్రం జనాభా మాత్రం లేరు. అందుకే జనాభా పెంచుకునేందుకు వెర్మంటా రాష్ట్రం ఇన్ని పాట్లు పడతోంది. వింత వింత పథకాలను ప్రవేశపెడుతోంది. 

అమెరికా : మీకు స్వంత ఇల్లు కావాలా? అయితే వెర్మాంట్ వెళ్లండి..
ఉద్యోగం కావాలా? అయితే వెర్మాంట్ వెళ్లండి..
ఎక్కువ మొత్తంలో డబ్బు కావాలా? అయితే వెర్మాంట్ వెళ్లండి..
ఐటీ కంపెనీలున్నాయ్..కానీ చేసేందుకెవరూ లేరు..
ఉండటానికి ఇల్లు ఇస్తామంటే వుండేందుకెవరూ లేరు..
డబ్బిస్తామంటే తీసుకునేందుకెవరూ రారు..
ఉద్యోగమిస్తామంటే చేసేందుకు కెవరు లేరు..

అమెరికా సంపన్న దేశమని అందరికీ తెలుసు. కానీ ఆ దేశంలోని ఓ రాష్ట్రంలో మాత్రం ఓ వినూత్నమైన పథకంతో  ఆకట్టుకునేందకు ప్రయత్నిస్తోంది. మా రాష్ట్రానికి రండి ఉండటాకి ఇల్లు, చేయటానికి ఉద్యోగం..ఖర్చు పెట్టుకునేందుకు భారీగా నగదు అన్నీ అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తామంటు ప్రకటించింది. అదే అమెరికాలోనే వెర్మాంటా రాష్ట్రం. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా అన్ని సౌకర్యాలు ఉన్నా ఆ రాష్ట్రం జనాభా మాత్రం లేరు. అందుకే జనాభా పెంచుకునేందుకు వెర్మంటా రాష్ట్రం ఇన్ని పాట్లు పడతోంది. వింత వింత పథకాలను ప్రవేశపెడుతోంది. వెర్మంటా రాష్ట్రానికి వెళితే ఆ రాష్ట్రానికి వెళితే ఉండడానికి ఇల్లు, చేయడానికి ఉద్యోగం అన్నీ ఉచితమే. వెర్మాంట్‌ రాష్ట్రంలోని ఏ ఊరికెళ్ళి స్థిరపడాలనుకున్నా డబ్బులు ఎదురిచ్చి మరీ ఆహ్వానిస్తారు. కాస్తో కూస్తో కాదు..ఏకంగా  ఏడు లక్షలిస్తారు. ఇదంతా కూడా ఆ ఊర్లో జనాభా పెంచేందుకు అక్కడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం.

జనాభా పెంచుకుందుకు వెర్మెంటా వినూత్న పథకం
చాలా దేశాల్లో జనాభా పెరుగుదలను నియంత్రించేందుకు పలు నిర్ణయాలు తీసుకుంటుంటే..వెర్మంటా రాష్ట్రం మాత్రం జనాభాను పెంచుకోవటానికి నానా అగచాట్లు పడుతోంది.అక్కడి జనాభాలో వయస్సు మళ్ళినవారే ఎక్కువ. యువతరం లేకపోవడంతో పదహారు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎలాగైనా రాష్ట్రంలో జనాభా సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో ఆ రాష్ట్రప్రభుత్వం ఈ వినూత్న పథకాన్ని రూపొందించింది.

అన్ని సౌకర్యాలు ఉచితమే!
వెర్మాంట్‌లో ఎన్నో ఉపాధి అవకాశాలు పుష్కలంగా వున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగం ఎంతో డెవలప్ అయ్యింది. కానీ ఉద్యోగాల్లో చేరేందుకు యువత లేకపోవటంతో వారిని ఆకర్షించేందుకు ఉద్యోగంతోపాటు పదివేల డాలర్లు క్యాష్‌ ఇవ్వాలని అధికారులు నిర్ణయించుకున్నారు. ఇలా మూడేళ్లపాటు ఏడాదికి పదివేల డాలర్ల చొప్పున ఇస్తారు. అన్ని ఫెసిలిటీస్ వుండే ఓ  ఇంటిని కూడా వారే ఇస్తారు. అంతేకాదు..ఆఫీస్ వెళ్లే ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే వుండి వర్క్ చేయాలనుకునేవారికి  కూడా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. 
కండిషన్స్ వర్తింపులు : మొదటి వందమందికే!పట్టణాలలోని  జనాభా పెంచుకునేందుకు వెర్మాంట్‌ రాష్ట్రం ప్రవేశపెడుతున్న ఈ పథకంలో ఓ మెలిక కూడా ఉందండోయ్‌! అక్కడ స్థిరపడేందుకు వెళ్ళే వారందరికీ కాదు. ఇలా వచ్చిన మొదటి వందమంది మాత్రమే ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందేందుకు అర్హులట.  అటు తర్వాత ఏడాదికి ఇరవైమంది చొప్పున ఈ పథకానికి ఎంపిక చేసి నిర్ణయించిన నగదును అందజేస్తుందట వెర్మంటా రాష్ట్ర ప్రభుత్వం.

READ  గడ్డ కట్టిన చికెన్‌తో కరోనా వైరస్ పాజిటివ్ వస్తుందంటోన్న చైనా

స్టే టూ వీకెండ్స్‌!
కోటిమందికిపైగా జీవించేందుకు వెసులుబాటు వున్న వెర్మాంట్‌ లో  ప్రస్తుత జనాభా కేవలం ఆరు లక్షలకు కొంచెం పైన మాత్రమే వుంది. ఈ జనాభాను కోటి ముప్పై లక్షలవరకు పెంచాలనే ఉద్దేశంతో ఇప్పటికే ‘స్టే టూ వీకెండ్స్‌’ పేరిట అమలు చేస్తున్న క్రమంలో చుట్టుప్రక్కల పట్టణాల్లోని ప్రజలు ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ మధ్య వీకెండ్స్ లో వెర్మంట్ కు వచ్చి టూరిస్ట్ ల్లా కంపెనీలతో డిస్కర్షన్స చేసుకోవచ్చు. 

యువత ఆసక్తి : టూరిజానికి ప్రత్యేక ప్రదేశం వెర్మాంట్
గ్రీన్‌ మౌంటెయిండ్‌ స్టేట్‌గా పేరొందిన వెర్మాంట్‌ రాష్ట్రం ప్రకృతి అందాలకు నెలవు. చుట్టూ పచ్చదనంతో నిండిన కొండలు, గలగలపారే సెలయేర్లు, సరస్సులతో పర్యాటకుల్ని ఆకర్షించే ప్రదేశాలు ఇక్కడి ప్రత్యేకతలు. ప్రశాంతతకి పెట్టింది పేరు వెర్మాంట్. పచ్చని పరిసరాలతో ఆహ్లాదంగా అలరిస్తోన్న వెర్మాంట్‌లో స్థిరపడేందుకు చాలామంది యువత ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు లేక..ఇబ్బందులు పడ్తున్న ఇంజనీర్లు, పోస్టుగ్రాడ్యుయేట్లు వెర్మాంట్‌లో స్థిరపడేందుకు మొగ్గుచూపుతున్నారని ఆ రాష్ట్రానికి వచ్చే అప్లికేషన్స్ తో తెలుస్తోంది. మరి జనాభా పెంచుకునేందుకు వెర్మాంట్ రాష్ట్రం చేస్తున్న ఈ వినూత్న పథకం ప్రభావం ఎలా వుంటుందో వేచి చూడాలి. 

Related Posts