Celebrities New Year Celebrations 2019 -10TV

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

విదేశాల్లో సెలబ్రెటీస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్

కొత్త కొత్త కోరికలతో, కోటి ఆశలతో 2019లోకి ఎంటర్ అయిపోయాం. సెలబ్రెటీలందరూ షూటింగ్స‌కి కాస్త బ్రేక్ ఇచ్చి, న్యూ ఇయర్‌ని సెలబ్రేట్ చేసుకోవడానికి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో కలిసి విదేశాలకు వెళ్ళిపోయారు. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్, క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్ని ఫ్యామిలీతో కలిసి అమెరికాలో జరుపుకున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో దుబాయ్‌లో న్యూ ఇయర్‌ని సెలబ్రేట్ చేసుకున్నాడు. లవ్ జంట నయనతార, విఘ్నేష్ శివన్ లాస్ వెగాస్‌లో ల్యాండ్ అవగా, నాగ చైతన్య, సమంత ఆమ్‌స్టర్‌డామ్‌లో హాలిడేని ఎంజాయ్ చేస్తున్నారు.

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, హాయ్ అజర్ బైజాన్ అంటూ అక్కడ వాలిపోయాడు. అల్లు శిరీష్ లెబనాన్‌లో, రెజీనా వియత్నాంలో, ప్రణీత ఇజ్రాయెల్‌లో ఉన్నారు. టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ అయితే ఫోన్ సిగ్నల్ కూడా ఉండని ఒక ఐలాండ్‌లో ఈ న్యూ ఇయర్‌ని సెటబ్రేట్ చేసుకోబోతున్నాడు. న్యూ కపుల్ ప్రియాంక చోప్రా, నిక్ జోనస్, సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ జంట స్విట్జర్లాండ్‌లో కొత్త సంవత్సరానికి వెల్‌కమ్ చెప్పారు.

విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ సిడ్నీ చెక్కేసారు. దీపిక, రణ్‌వీర్ లండన్‌లో ఉన్నారని బాలీవుడ్ టాక్. అజయ్ దేవ్‌గణ్, కాజోల్ పిల్లలతో కలిసి    థాయ్ లాండ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. వీరితోపాటు పలువురు తారలు విదేశాల్లోని, వివిధ ప్రాంతాల్లో న్యూ ఇయర్‌ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.

Ajay Devgan

Related Posts