dpr-has-been-sent-center-government-says-metro-md-ramakrishna-reddy

డీపీఆర్ పంపలేదనడం దారుణం : మెట్రో ఎండీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మెట్రో రైలు నిర్మాణం కోసం డీపీఆర్ పంపలేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం దారుణమన్నారు మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి. 2015 జూన్ 29న కేంద్రానికి డీపీఆర్ పంపామని గుర్తు చేశారాయన. కేంద్రం ఆమోదించాకే అమరావతి మెట్రోరైల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. మరోసారి డీపీఆర్ సిద్ధం చేస్తామన్నారు. ఫ్రాన్స్ కు చెందిన సిస్ట్రాగ్రూప్ ఆఫ్ కన్సార్టియం 2019 ఫిబ్రవరి చివరినాటికి డీపీఆర్ ఇవ్వనుందని తెలిపారు. అమరావతి నుంచి 24 కిలో మీటర్ల వరకు మెట్రో రైలు కోసం డీపీఆర్ సిద్ధం చేస్తున్నామని వివరించారు.

Related Posts