Father attacks daughter, Deviyani fall in love, Father attack with knife daughter, Nellore murder  attempt

ప్రేమించడం తప్పా : కూతురిపై తండ్రి దాడి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో కూతురిపై ఓ తండ్రి కత్తితో నరికిన ఘటన గుర్తుండే ఉంటుంది…కదా..ఇలాంటి ఘటనే నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. తీవ్రగాయాలైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

నెల్లూరు : హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో కూతురిపై ఓ తండ్రి కత్తితో నరికిన ఘటన గుర్తుండే ఉంటుంది…కదా..ఇలాంటి ఘటనే నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. తీవ్రగాయాలైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీనికి కూడా ప్రేమే కారణం…తమ కులం కాని వ్యక్తితో ప్రేమాయణం జరుపుతోందన్న కారణంతో తండ్రి విచక్షణారహితంగా కత్తితో దాడి జరపడం కుల ఉన్మాదం ఎంత తలకెక్కిందో అర్థమౌతోంది…
వివరాల్లోకి వెళితే…..ఏడేళ్లుగా ప్రేమాయణం…
గూడూరుకు చెందిన నర్సింగరావుపేటకు చెందిన దేవయాని…ఆదిశంకరచార్య కాలేజీలో బీటెక్ థర్డ్‌ఇయర్ చదువుతోంది. వీరారెడ్డిపల్లెకు చెందిన జావెద్‌ ఎస్వీఆర్ట్స్ కాలేజీలో విద్యనభ్యసిస్తున్నారు. వీరిద్దరూ గత ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ వ్యవహారం దేవయాని ఇంట్లో తెలిసింది. తనను టార్చర్ పెడుతున్నారని..చనిపోతానని దేవయాని..జావెద్‌కు తెలిపింది. అలా చేయవద్దంటూ మాట్లాడుతానని చెప్పి ఆమె ఇంటికి సమీపంలో వచ్చి దేవయానితో జావెద్ మాట్లాడుతున్నాడు. 
కత్తితో దాడి చేసిన ఫాదర్…
దీనిని చూసిన దేవయాని తండ్రి సిద్ధయ్యకు తీవ్ర ఆగ్రహం వచ్చింది. వెంటనే కత్తి చేతపట్టుకుని వారిపై దాడి చేశాడు. ఈ దాడిలో జావెద్ తప్పించుకోగా దేవయానికి మాత్రం తల..చేతులపై తీవ్రగాయాలయ్యాయి. అనంతరం సిద్ధయ్య పరారయ్యాడు. జావెద్..స్థానికులు…కలిసి దేవయానిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న సిద్ధయ్యను పట్టుకోవడానికి గాలింపులు చర్యలు చేపట్టారు. 

Related Posts