krishna-krishnam-raju-launched-maa-silver-jubilee-diary-2019-10tv

సూపర్ స్టార్, రెబల్ స్టార్ రిలీజ్ చేసిన మా సిల్వర్ జూబ్లీ డైరీ-2019

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అందరం మరికొద్ది రోజుల్లో కొత్త ఆశలతో 2019 వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని, మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ (మా) సభ్యులందరూ సమావేశమై, సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల దంపతుల చేతుల మీదగా, మా-2019 డైరీని ఆవిష్కరింప చేసారు. ఈ కార్యక్రమానికి రెబల్ స్టార్ కృష్ణంరాజు దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జయసుధ, పరుచూరి బ్రదర్స్ జ్యోతి ప్రజ్వలన చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా, మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ (మా) తమకు అన్నం పెడుతుందని, మా అందరికీ (మా) తల్లి లాంటిదని నటీనటులందరూ అన్నారు. మా-2019 డైరీ  ఆవిష్కరణ కార్యక్రమానికి, వీకే నరేష్, నాగినీడు, శివాజీ రాజా, నర్సింగ్ యాదవ్, గీతా సింగ్ తదితర నటీనటులంతా హాజరయ్యారు.

Related Posts