nokia 9 cam s

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 9 కెమెరాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్ర‌ముఖ మొబైల్ త‌యారీ సంస్థ‌  హెచ్‌ఎండీ గ్లోబల్‌తో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన నోకియా మరో స‌రికొత్త స్మార్ట్‌ఫోన్‌తో ముందుకోస్తోంది. ఒక‌టి కాదు.. రెండు కాదు..  ఏకంగా ఏడు కెమెరాలతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను భార‌త మార్కెట్ల‌లోకి ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. అదే నోకియా 9 ప్యూర్‌ వ్యూ. ప్రపంచంలోనే  ఏడు కెమెరాలతో ఇదే తొలి స్మార్ట్‌ఫోన్ కావ‌డం విశేషం. కానీ, ఈ స్మార్ట్ ఫోన్ విడుద‌ల చేయ‌డానికి ముందే దీని ఫీచ‌ర్లకు సంబంధించిన‌ వీడియో ఒక‌టి లీకైంది. ఆ వీడియోలో నోకియా ప్యూర్ వ్యూ ఫోన్ ప్ర‌త్యేక ఫీచ‌ర్లు యూజ‌ర్ల‌ను ఎట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. ముఖ్యంగా నోకియా 9 ప్యూర్‌ వ్యూలో ఫ్రంట్ 7  కెమెరాలు, బ్యాక్  2 కెమెరాలు మ‌రింత ఆక‌ర్షించ‌నున్నాయి. హెచ్ఎండీ మొబైల్ సంస్థ అందించే ఈ స‌రికొత్త ఫోన్ మోడ‌ల్‌ను మొత్తం 9 కెమెరాలతో  రూపొందించింది. ఇందులోని  కెమెరా సెన్సార్లు సాధారణ లైట్ క్వాలిటీ కెమెరా సెన్సార్ కంటే 10 రెట్లు ఎక్కువగా ప్ర‌భావంతంగా ప‌నిచేస్తాయి. సెన్సార్ ఉండ‌టం వ‌ల్ల హెచ్‌డీ క్వాలిటీతో కూడిన ఫొటోలు తీసే వీలుంది. నోకియా మోడ‌ల్స్‌లో రానున్న ఈ మెడ్రాన్ మొబైల్ ప్రపంచంలోనే తొలి డివైస్‌గా నిల‌వ‌నుంది. ప్యూర్‌ డిస్‌ ప్లే ప్యానెల్‌తో తీసుకొస్తున్నఈ డివైస్‌ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. 

నోకియా 9 ప్యూర్‌ వ్యూ: 
5.9 అంగుళాల డిస్‌ప్లే 
క్వాల్కం స్నాప్‌డ్రాగన్‌ 845 సాక్‌
6జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌
8జీబీ ర్యామ్‌/256జీబీ స్టోరేజ్‌
ఫింగర్‌ ప్రింట్‌ డిస్‌ప్లే.

Related Posts