parliament-seat-bihar-seat-seting-quota-between-lpg-and-nda-government

బీజేపీ ముందస్తు సెట్టింగ్ : పంతం నెగ్గించుకున్న పాశ్వాన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

లోక్ సభలో ఎన్నికల్లో సీట్ల సర్ధుబాట్ల కోసం బీజేపీ స్థానిక పార్టీలతో మంతనాలను షురూ చేసింది. 2019  లోక్ సభ ఎన్నికల్లో బీహార్ లో ఎన్డీయే కూటమికి మధ్య సీట్ల సర్ధుబాటు ఖారారైంది. ఎన్డీయేతో తమకు ఆమోదకరమైన విధానంతో సీట్ల సంఖ్య ఉంటేనే ఎన్డీయేతో కలిసుంటామని స్పష్టం చేసారు ఎల్జేపీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్. దీంతో ఆరు పార్లమెంట్ సీట్లలో పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 40 సీట్లుండగా, బీజేపీ, జేడీయూలు చెరో 17 సీట్లు..మిగతావాటిల్లో ఎల్జేపీ పోటీ పడేందుకు సిద్ధపడుతున్నాయి. దీంతో ఎన్నికంటే ముందుగానే రాంవిలాస్  పాశ్వాన్ ను రాజ్యసభకు పంపించేందుకూ ఎన్డీయే అధిష్టానం అంగీకరించింది. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు.

బీహార్ సీఎం నితీశ్ కుమార్, పాశ్వాన్ లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించినన అమిత్ షా 2014లో రాష్ట్రంలో 31 సీట్లలో విజయం సాధించామని..ఈ సారి అంతకుమించి సీట్లు రానున్నాయని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. కాగా..ఎన్డీయే నుంచి ఇటీవల ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని ఆర్ఎస్ఎల్పీ బయటకు వచ్చిన అనంతరం  ఆ అవకాశాన్ని పాశ్వాన్ సమర్థవంతంగా వినియోగించుకున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

Related Posts