narendra modi

రైతు రుణమాఫీ ఎన్నికల స్టంట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఢిల్లీ: రైతు రుణమాఫీపై గత శనివారం కాంగ్రెస్ పార్టీని లాలీపాప్ కంపెనీ అని వ్యాఖ్యానించిన ప్రధాని మోడీ కొత్త సంవత్సరం ప్రారంభం రోజున అదొక పెద్ద ఎన్నికల స్టంట్ అని కొట్టి పారేశారు. దేవీలాల్ దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ వరకు దేశంలో  అనేక సార్లు రైతు రుణమాఫీ చేసినప్పటికీ రైతు బాగుపడింది లేదని  మంగళవారం ఒక న్యూస్ ఏజెన్సీ కిచ్చిన ఇంటర్వ్యూలో మోడీ వ్యాఖ్యానించారు. వాస్తవానికి రుణమాఫీకి  అర్హులైన రైతులెవ్వరూ బ్యాంకులవద్ద అప్పులు తీసుకోరని, చిన్న రైతులంతా వడ్డీ వ్యాపారులవద్దే రుణాలు తీసుకుంటారని ఆయన అన్నారు. రైతులకు మేలు చేసే ఉద్దేశ్యంతో కృషి సంచాయ్ యోజన అమలు చేశామని మోడీ చెప్పారు.
 

Related Posts