Police ruthlessly beats youth In Rudrapur Video Viral | 10TV

వీడియో వైరల్ : పోలీసులే చావబాదారు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రుద్రాపూర్ : కొట్టారు..ముష్టిఘాతాలతో విరుచకపడ్డారు..దుస్తులను చింపివేశారు..కిందపడేసి కాళ్లతో తన్నారు…ఇష్టమొచ్చినట్లుగా చావబాదారు…సాక్షాత్తూ పోలీసులే ఈ దాడికి పాల్పడడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 

రుద్రపూర్…
ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో రుద్రపూర్‌లో ఓ యువకుడిని పట్టుకుని కొంతమంది పోలీసులు పట్టుకున్నారు. పట్టుకోవడమే ఆలస్యం చేతులకు..కాళ్లకు పని చెప్పారు. బూతులు తిడుతూ…ముఖంపై..ఎక్కడిపడితే అక్కడ చావబాదారు. తప్పించుకోవడానికి ఆ యువకుడు పరుగులు తీస్తే వెంబడించాడు ఓ పోలీస్. పట్టుకుని కిందపడేసి కాళ్లతో తన్నాడు. ఇదంతా అక్కడున్న వారు చూస్తున్నారే కానీ అతడిని రక్షించలేకపోయారు. ఎందుకంటే దాడి చేస్తున్నది పోలీసులు కాబట్టి. చివరకు తీవ్రగాయాలైన ఆ యువకుడు ఎలాగో అక్కడి నుండి వెళ్లిపోయాడు. వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించాల్సి వచ్చింది. విచారణకు ఆదేశించారు. అసలు ఆ యువకుడిపై ఎందుకు దాడికి పాల్పడ్డారో తెలియలేదు. 

Related Posts