prabhas case moved to high court bench

ప్రభాస్ పిటీషన్ : హైకోర్ట్ డివిజన్ బెంచ్ కు బదిలీ..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

హీరో ప్రభాస్ వేసిన పిటీషన్ పై హైకోర్టులో వాడీ వేడీగా వాదనలు కొనసాగుతున్నాయి. రాయదుర్గంలోని తన  గెస్ట్ హౌస్ ను సీజ్ చేయటాన్ని సవాల్ చేస్తు హరో ప్రభాస్ హైకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటీషన్ పై విచారణ చేపట్టింది ధర్మాసనం. CS/7 లో భూమి వుందా? లేదా? అని పిటీషనర్ ప్రభాస్ న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. తాము కొనుగోలు చేసింది  రాయదుర్గంలోని సాన్ మక్త స్థలమేనని ప్రభాస్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే రాయదుర్గంలోని పాన్ మక్త స్థలం ప్రభుత్వ భూమి అని కోర్టు డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. అనంతరం ఈ పిటీషన్ విచారణను సింగిల్ బెంచ్ నుండి డివిజన్ బెంచ్ కు బదిలీ చేయాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు. దీంతో డివిజన్ బెంచ్ ఈ పిటీషన్ పై విచారణను రేపటికి అంటే డిసెంబర్ 20వ తేదీని వాయిదా వేయటంతో రేపు ఈ కేసుపై వాదనలు కొనసాగనున్నాయి.  
కాగా తాను ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదనీ..లీగల్ గానే కొన్న స్థలంలో  తాను గెస్ట్ హౌస్  నిర్మించుకున్నాననీ దీన్ని రంగారెడ్ రెవెన్యూ అధికారులు కూల్చివేయటాన్ని నిరసిస్తు..దీనిపై న్యాయం చేయాలని కోరుతో బాహుబలి ప్రభాస్ కోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. 
కాగా రాయదుర్గంలోని సర్వే నెంబర్ 46లో ఉన్న 84 ఎకరాల స్థలంపై 40 ఏళ్లుగా వివాదం కొనసాగింది. అది తమ స్థలం అని ప్రైవేటు వ్యక్తులు, ఇటు ప్రభుత్వ అధికారులు కోర్టుని ఆశ్రయించారు. వాదోపవాదాల తర్వాత సాక్ష్యాల మేరకు ఆ స్థలం ప్రభుత్వానికి చెందినదిగా పరిగణిస్తూ సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పు ఇచ్చింది. దీంతో ఆ స్థలంలో ప్రైవేటు వ్యక్తులు నిర్మించిన కట్టడాలను రెవెన్యూ అధికారులు కూల్చి వేస్తున్నారు. అదే స్థలంలో ఉన్న ప్రభాస్ ఇంటిని అధికారులు సీజ్ చేయటంతో ప్రభాస్ హైకోర్టులో పిటీషన్ వేసారు.

Related Posts