Petta  Official Tamil Trailer, Superstar Rajinikanth, Sun Pictures, Karthik Subbaraj, Anirudh

పెట్టా తమిళ్ ట్రైలర్ : నాతో పెట్టుకుంటే పిచ్చపిచ్చగా కొడతా…

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్, సిమ్రన్, త్రిష హీరో, హీరోయిన్లుగా, యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో, కళానిధి మారన్ సమర్పణలో, సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా..

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్, సిమ్రన్, త్రిష హీరో, హీరోయిన్లుగా, యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో, కళానిధి మారన్ సమర్పణలో, సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా.. పెట్టా.. తెలుగులో పేట పేరుతో రిలీజ్ కాబోతుంది. తెలుగులో సంక్రాంతికి పెద్ద సినిమాల పోటీ ఉండడంతో పేట రిలీజ్ అవుతుందా, లేదా అనే డౌట్ ఉంది నిన్నటివరకు. ఎట్టి పరిస్థితిలోనూ రిలీజ్ డిలే అయ్యే చాన్సే లేదని, జనవరి 10న థియేటర్లలో బొమ్మ పడడం ఖాయం అంటూ, హడావిడిగా కొత్త తెలుగు పోస్టర్లు వదిలాడు నిర్మాత అశోక్ వల్లభనేని.

ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్‌కీ స్పందన బాగుంది. ఇదిలా ఉంటే కొద్దిసేపటి క్రితం పెట్టా తమిళ్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. టీజరే అనుకుంటే, అంతకుమించి ట్రైలర్‌లో రచ్చ చేసాడు రజినీ. సూపర్ స్టార్ స్టైల్, లుక్స్ పరంగా అదరగొట్టేసాడు. పెద్ద పెద్ద మీసాలతో, గెడ్డంతో రఫ్ లుక్‌లోనూ కనిపించిన రజినీ, యాక్షన్ సీన్స్, రొమాంటిక్ సీన్స్‌లో ఇరగదీసేసాడు. 

ఇక తన స్టైల్ డైలాగ్స్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ట్రైలర్ చివర్లో రజినీ బ్లాక్ కుర్తా, తెల్ల పంచెలో చేతులతో స్టెప్పు వేసుకుంటూ రావడం అయితే అదిరిపోయింది. విజయ్ సేతుపతి, బాబీ సింహా, నవాజుద్దీన్ సిద్దిఖీ, మేఘా ఆకాష్ తదితరులు నటిస్తున్న పెట్టా, జనవరి 10న తమిళ్, తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

వాచ్ పెట్టా తమిళ్ ట్రైలర్…  

Related Posts