Telangana districts direct rail link, Medchal siddipet,medak, sircilla, karimnagar hyderabad, railway line

70ఏళ్ల కల: హైదరాబాద్ నుంచి 5 జిల్లాలకు డైరెక్ట్ ట్రైన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

నిరీక్షణకు తెర పడనుంది. 70ఏళ్ల రైలు ప్రయాణం కల సాకారం కానుంది. హైదరాబాద్ నుంచి 5 జిల్లాలకు డైరెక్ట్ ట్రైన్ రానుంది.

నిరీక్షణకు తెర పడనుంది. 70ఏళ్ల రైలు ప్రయాణం కల సాకారం కానుంది. హైదరాబాద్ నుంచి 5 జిల్లాలకు డైరెక్ట్ ట్రైన్ రానుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న హైదరాబాద్-కరీంనగర్ రైల్వే లైన్ ప్రాజెక్ట్ త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రాజెక్ట్ పనులను రైల్వే అధికారులు మరింత ముమ్మరం చేశారు. 2019లో అందుబాటులోకి తీసుకురావాలని పట్టుదలగా ఉన్నారు. ఈ ట్రాక్ అందుబాటులోకి వస్తే తెలంగాణలోని 5 జిల్లాలకు హైదరాబాద్‌తో కనెక్టివిటీ ఏర్పడనుంది. మేడ్చల్, సిద్ధిపేట, మెదక్, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల ప్రజలకు ఉపయోగకరంగా ఉండనుంది. హైదరాబాద్‌కు రావాలంటే బస్సులో మాత్రమే రావాల్సిన పరిస్థితి.

త్వరలోనే రైలు సౌకర్యం కూడా అందుబాటులోకి రానుంది. 2016 అగస్టులో ప్రధాని మోదీ ఈ ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన చేశారు. 5 జిల్లాలకు చెందిన 50లక్షల మంది ఈ రైలుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 2019 మార్చి నాటికి తొలి దశ పనులు పూర్తి చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. మిగతా మూడు దశల పనులను కూడా 2019లోనూ పూర్తి చేస్తామన్నారు. 2018-19 రైల్వే బడ్జెట్‌లో ఈ ప్రాజెక్ట్ కోసం రూ.125కోట్లు కేటాయించారు. వేములవాల, సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వే‌ల్‌ను టచ్ చేస్తూ ఈ రైలు రాకపోకలు సాగనున్నాయి.

Related Posts