us governament salaries stop this month

అమెరికాలో షట్ డౌన్ : క్రిస్మస్ వేళ జీతాలు బంద్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అగ్రరాజ్యంలో ఆర్థిక సమస్యలు’ చుట్టుముట్టాయి. అక్కడ పరిపాలన స్తంభించిపోయింది. ట్రంప్ సర్కార్ ప్రవేశ పెట్టిన ఓ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోవడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. దీని ఫలితంగా అమెరికాలో కల్లోల వాతావరణం కనిపిస్తోంది. క్రిస్మస్ పండుగ రోజుల్లో అమెరికాలో ఇలాంటి పరిస్థితి ఏర్పడడంతో చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ షట్ డౌన్ వల్ల 8 లక్షల మంది అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంతమందికి వేతనాలు లభించవు. మరికొందరు జీతం లేకుండానే పనిచేయాల్సి వస్తుంది. 
ఫెడరల్ వ్యయ బిల్లు…
ఫెడరల్ వ్యయ బిల్లును ఆమోదించకుండానే కాంగ్రెస్ వాయిదా పడింది. డిసెంబర్ 21 శుక్రవారం అర్ధరాత్రి నుండి పలు కీలక సంస్థల కార్యాకలాపాలు స్తంభించిపోయాయి. మెక్సికో సరిహద్దులో భారీ గోడ నిర్మిస్తానని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హామీనివ్వడం…దానికి అవసరమైన నిధులు కేటాయించాలంటూ (రూ. 35వేల కోట్లు) కాంగ్రెస్‌ను ట్రంప్ కోరుతున్నారు.
తాత్కాలిక బడ్జెట్‌కు ట్రంప్ వ్యతిరేకం…
గోడ నిర్మాణం కోసం ప్రతినిధుల సభ ఆమోదించిన 5 బిలియన్ డాలర్ల కేటాయింపు బడ్జెట్ బిల్లును సెనెట్ తిరస్కరించింది. ఇందుకు తాత్కాలిక బడ్జెట్ బిల్లును రూపొందించడాన్ని ట్రంప్ వ్యతిరేకించారు. నిధులు కేటాయించాల్సిందేనని ట్రంప్ పట్టుబట్టినా డెమెక్రాట్లు నిరాకరించారు. ఫెడరల్ వ్యయ బిల్లు ఆమోదం పొందకుండానే కాంగ్రెస్ శుక్రవారం వాయిదా పడడంతో ప్రభుత్వం పాక్షికంగా మూతబడింది. 
ఉద్యోగులపై తీవ్ర ప్రభావం…
ప్రభుత్వం మూతబడడంతో దాదాపు 8 లక్షల ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. వారిలో 4 లక్షల మంది ఉద్యోగులు వేతనాలు తీసుకోకుండా పనిచేయాల్సి వస్తే మరో 4 లక్షల మంది సెలవుపై వెళ్లాల్సి ఉంటుంది. దీనివల్ల డాలర్ విలువ పడిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో నెలకొన్న ప్రభావం భారతదేశంపై ఉంటుందా అనే ఆందోళన వ్యక్తౌమౌతోంది. 

Related Posts