Home » ప్రత్యేక రైళ్లు మరికొంత కాలం నడుపుతాం
Published
2 months agoon
By
murthyContinuation of Running of all special trains : కరోనా వైరస్ నేపధ్యంలో నడిపిస్తున్న ప్రత్యేక రైళ్ల సేవలను మరికొంతకాలం పాటు పొడిగిస్తున్నట్లు దక్షిణమధ్యరైల్వే శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
వీటిలో
సికింద్రాబాద్-హౌరా-సికింద్రాబాద్ (నం.02702/02705)
విజయవాడ-చెన్నైసెంట్రల్-విజయవాడ (నం.02711/02712)
విజయవాడ-విశాఖపట్నం-విజయవాడ(నం.02718/02717)
సికింద్రాబాద్-శాలిమార్-సికింద్రాబాద్(నం.02774/02773) రైళ్లు ఉన్నాయి.
కాగా డిసెంబరు 1 వతేదీ నుంచి ఈ రైళ్ల ప్రయాణ సమయంలో మార్పు ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
ఇవి కాక పండుగల సందర్భంగా నడిపిస్తున్న ప్రత్యేక రైళ్లను కూడా మరికొంతకాలం నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే ప్రకటించింది. 14 ప్రత్యేక రైళ్ళు తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
దసరా, దీపావళి రద్దీని దృష్టిలో పెట్టుకుని నడిపిస్తున్న 12 పండగ ప్రత్యేక రైళ్లను డిసెంబరు నెలాఖరు వరకు పొడిగించింది. అయ్యప్ప భక్తుల కోసం సికింద్రాబాద్-త్రివేండ్రం మధ్య రెండు రైళ్లను జనవరి 20 వరకు నడపాలని నిర్ణయించింది. ప్రత్యేక రైళ్ల సమయాలు డిసెంబరు 1 నుంచి మారుతున్నట్లు తెలిపింది.
పొడిగించిన ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్-విశాఖపట్నం-హైదరాబాద్ (నం.02728/02727)
హైదరాబాద్-న్యూఢిల్లీ-హైదరాబాద్ (నం.02723/02724)
సికింద్రాబాద్-విశాఖపట్నం-సికింద్రాబాద్ (నం.02784/02783)
లింగంపల్లి-కాకినాడ టౌన్-లింగంపల్లి (నం.02776/02775)
తిరుపతి-విశాఖపట్నం-తిరుపతి (నం.02708/02707)
హైదరాబాద్-ముంబయి-హైదరాబాద్ (నం.02702/02701)
తిరుపతి-నిజామాబాద్-తిరుపతి (నం.02793/02792)
ఈ రైళ్లు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగుతాయని రైల్వే అధికారులు తెలిపారు.
డిసెంబరు నెలాఖరు వరకు కొనసాగే రైళ్లు
తిరుపతి-లింగంపల్లి-తిరుపతి (నం.02733/02734)
కాకినాడ పోర్ట్-లింగంపల్లి-కాకినాడ పోర్ట్ (నం.02737/02738)
నర్సాపూర్-లింగంపల్లి-నర్సాపూర్ (నం.07255/07256)
హైదరాబాద్-తాంబరం-హైదరాబాద్ (నం.02760/02759)
హైదరాబాద్-ఔరంగాబాద్-హైదరాబాద్ (నం.07049/07050)
తిరుపతి-అమరావతి-తిరుపతి (నం.02765/02766)
కాచిగూడ-బెంగళూర్-మైసూర్ రైలు…. ఈరైళ్లను డిసెంబరు 31 వరకు పొడిగించారు.
కాగా….సికింద్రాబాద్-త్రివేండ్రం సెంట్రల్-సికింద్రాబాద్ (నం.07230/07229) జనవరి 20 వరకు పొడిగించారు.