లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

సప్తగిరి పత్రికలో కుశుడిపై వివాదాస్పద కథనం..ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్

Published

on

Controversial article on kushudu in Saptagiri magazine, Two employees suspended

సప్తగిరి పత్రికలో కుశుడిపై వివాదాస్పద కథనం ప్రచురణపై టీటీడీ కొరడా ఝుళిపించింది. ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసింది. పత్రిక ప్రధాన సంపాదకుడితోపాటు మరో ఉప సంపాదుకుడిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశాన్ని టీటీడీ చాలా సీరియస్ గా తీసుకుంది. ప్రధానంగా సీతారామ దంపతుల కుమారుడు కుశుడిపైన టీటీడీ అనుబంధ పత్రికలో అత్యంత వివాదాస్పద కథనం ప్రచురితమైంది. 

ప్రధానంగా కుశుడు శ్రీరామ దంపతుల తనయుడే కాదని, అతను వాల్మీకి సృష్టంటూ వివాదాస్పద కథనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. బీజేపీ నేతలు దీనిపై ఆందోళన  కూడా చెశారు. దీనిపై విజిలెన్స్ విచారణ చేపట్టిన టీటీడీ..చివరకు ఇద్దరు సప్తగిరి పత్రిక ఉద్యోగులపైన కొరడా ఝుళిపించింది. ప్రధానంగా పత్రిక ప్రధాన సంపాదుకుడు రాధారమణ, పత్రికలో సబ్ ఎడిటర్ గా పని చేస్తున్న ఉత్తర పాల్గుణపై కొరడా ఝుళిపించింది. వీరిద్దరిని కూడా ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ కొద్ది సేపటి క్రితమే టీటీడీ సంచలన ఆదేశాలు జారీ చేసింది. 

ఎందుకంటే ఉద్యోగుల్లో కాస్తా భయం ఉండాలి. కుశుడిపై ప్రచురించిన కథనం  వెనుకాల ఎట్లాంటి ఆధారపూరిత చారిత్రక ఇతిహాసం లేదు. రామాయణం లాంటి ఇతిహాసం విషయంలో వివాదాస్పద కథనాల ప్రచురణకు ఏమాత్రం అనుమతి లేదు. ముందు, వెనుక ఆలోచించకుండా ఇలాంటి కథనాన్ని ప్రచురించిన ఇద్దరు ఉద్యోగులపైన కొరడా ఝళిపించింది. ఇద్దరిని కూడా ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Read: నన్ను చంపడానికి అఖిలప్రియ ప్రయత్నించింది : ఏవీ సుబ్బారెడ్డి

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *