15ఏళ్ల క్రితం కనుమరుగైన పోలీస్.. బిచ్చగాడిలా బ్యాచ్‌మేట్‌లకు కనిపించడంతో షాక్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

గ్వాలియర్‌లో ఎలక్షన్ డ్యూటీ చేస్తున్న ఇద్దరు మధ్యప్రదేశ్ పోలీసులకు 15ఏళ్ల క్రితం మిస్ అయిన ఫ్రెండ్ కనిపించాడు. మానసికంగా డిస్టర్బ్ అయిన వ్యక్తి అక్కడి వీధుల్లో బిచ్చమెత్తుకుంటూ కనిపించడంతో షాక్ అయ్యారు. డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ రత్నేశ్ సింగ్ తోమర్, సహోద్యోగి విజయ్ భాదోరియాలు కొద్ది రోజుల క్రితం గ్వాలియర్ వెళ్లారు.

నవంబర్ 10న ఎన్నికల ఫలితాల కోసం కౌంటింగ్ జరుగుతుంది. వారిద్దరూ జాన్సీ రోడ్ దాటుతుండగా ఓ మధ్య వయస్కుడు ఫుట్‌పాత్‌పై చలికి వణుకుతూ కనిపించాడు. సాయం చేద్దామని వెహికల్ నుంచి బయటకు దిగారు. రత్నేశ్ అతని బూట్లు తీసి, విజయ్ అతని జాకెట్ తీసి కప్పుకోవడానికి ఇచ్చారు.కాసేపటి వరకూ చర్చలు జరిగిన తర్వాత పరిస్థితి మారింది. అప్పుడే అర్థమైంది వారిద్దరికీ ఆ బిచ్చగాడు మరెవరో కాదు తమ మాజీ ఉద్యోగి మనీశ్ మిశ్రా అని.

మిశ్రా.. 1999లో పోలీస్ సర్వీస్ లో జాయిన్ అయిన ఆఫీసర్. షూటర్ కూడా. రాష్ట్ర వ్యాప్తంగా చాలా పోలీస్ స్టేషన్లకు ఇన్‌ఛార్జిగా కూడా వ్యవహరించారు. 2005లో సర్వీసులో ఉండగానే మానసికంగా డిస్టర్బ్ అయిన కనిపించకుండాపోయాడు.

police manish misra

చాలా సార్లు అడిగినప్పటికీ తిరిగి రావడానికి నిరాకరించాడు. దాంతో అతణ్ని సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కు అప్పగించారు. వారే ఆ మాజీ పోలీస్ ఆఫీసర్ బాధ్యతలను చూసుకుంటున్నారు.

Related Tags :

Related Posts :