తెలంగాణలో కరోనా @ 1813 : కొత్త కేసులు 52

Corona @ 1813..52 new cases in Telangana

తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కరోన కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ వైరస్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..ఎక్కడో ఒక చోట వైరస్ బారిన పడుతున్నారు. ప్రధానంగా GHMC పరిధిలో కేసులు రికార్డవుతున్నాయి. తాజాగా..2020, మే 23వ తేదీ శనివారం కొత్తగా 52 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్ఎంసీ పరిధిలో 33 రికార్డయ్యాయని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

ఇందులో విదేశాల నుంచి వచ్చిన వారు నలుగురు కాగా, మరో 15 మంది మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కూలీలున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 1813. శనివారం ఒకరు చనిపోయారు. మరణాల సంఖ్య 49గా ఉంది. కొత్తగా 25 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 1,068 డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం గాంధీలో 696 మంది చికిత్స పొందుతున్నారు. 
వివిధ దేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చిన వారు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారని ప్రజారోగ్య సంచాలకులు డా. శ్రీనివాసరావు వెల్లడించారు. అత్యధికంగా యాదాద్రి జిల్లాకు చెందిన వారు 35 మంది ఉన్నారని, జగిత్యాలలో 30, మంచిర్యాల 23, నల్గొండ 7, మహబూబాబాద్ 5, జనగాం 5, సిరిసిల్ల 4, నిజామాబాద్ 3, నిర్మల్, ఖమ్మం కరీంనగర్‌లలో రెండేసి, భూపాలపల్లిలో ఒక కేసు నమోదైందని ఆయన తెలిపారు. 

మరిన్ని తాజా వార్తలు