లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Health

కరోనా-ఎయిడ్ యాంటీ వైరల్ ఇమ్యూనిటీ బూస్టర్ విడుదల

Published

on

Corona-AID Anti Viral Immunity Booster : ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో సీసీఎంబీ, అటల్ ఇంక్యుబేషన్ ఆధ్వర్యంలో కోవిడ్ ఎయిడ్ పేరుతో తినుబండారాన్ని ఆవిష్కరించారు. పుట్టగొడుగులతో ఇమ్యూనిటీని పెంచుకునేలా సరికొత్త పదార్థాన్ని మార్కెట్లోకి తీసుకురాబోతోంది.అయితే ఇది కరోనా వ్యాక్సిన్ కు ప్రత్యామ్నాయం కాదని.. కేవలం కరోనాకు ఇమ్యూనిటీ బూస్టర్ వలే పనిచేస్తుందని చెబుతున్నారు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సీఈఓ డాక్టర్ మధుసూధన్. ఈ కోవిడ్ ఎయిడ్ తో కొంతమేర ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.ఈ ఫంగస్.. కార్టిసెప్స్.. పుట్టగొడుగులు.. అంటారు.. ఇది ఎక్కువగా హిమాలయాల వాతావరణంలోనే పెరుగుతుంది. నేచరుల్‌గా పెరుగుతుంది..

Corona-AID Anti Viral

ఆరోగ్యపరంగా అనేక గుణాలు ఉన్నాయంటున్నారు. ఆ కంపౌండ్ వల్ల వైరస్‌ను కూడా తగ్గించే గుణం కూడా ఉందని బయటపడలేదు.ఈ కరోనా ఎయిడ్ తీసుకున్నవారిలో ఇమ్యూనో బూస్టింగ్ మాత్రమే కాకుండా కరోనా వైరస్ తగ్గే అవకాశం ఉందని తమ పరిశోధనలు చెబుతున్నాయని మధు సూధన్ వెల్లడించారు. ఇది కేవలం ఫుడ సప్లిమెంట్ మాత్రమేనని అన్నారు. ప్రోటీన్లపైనే వ్యాక్సిన్ డెవలప్ చేస్తారని చెప్పారు.

Corona-AID Anti Viralపుట్టగొడుగులు తిన్నవారిలో అలర్జీల సమస్యలు ఉండకపోవచ్చునని అన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని మధుసూధన్ పేర్కొన్నారు. కరోనా వైరస్ విస్తరించిన నేపథ్యంలో ప్రతిఒక్కరూ మాస్క్, భౌతిక దూరం పాటించక తప్పదని అన్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *