Corona in AP: Details of District-wise Cases

AP లో Corona : ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే…

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆంధ్రప్రదేశ్ లో కరోనా డేంజర్ బెల్స్ మ్రోగిస్తోంది. ఇప్పటికే 10 వేల కేసులు దాటిన సంగతి తెలిసిందే. తాజాగా 2020, జూన్ 25వ తేదీ గురువారం కొత్తగా 553 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 10 వేల 884కి చేరాయి.

రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల 760 యాక్టివ్ కేసులు ఉండగా..ఇప్పటి వరకు 136 మంది చనిపోయారు. 19 వేల 085 శాంపిల్స్ పరీక్షించగా..477 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారించబడిందని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 69, విదేశాల నుంచి వచ్చిన 07 గురికి వైరస్ సోకిందని గురువారం ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

గురువారం 118 మంది కోవిడ్ ను కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, కోవిడ్ వల్ల కర్నూలులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఒక్కరు చనిపోయారు. 

రాష్ట్రంలో 7, 69, 319 శాంపిల్స్ ను పరీక్షించగా…8 వేల 783 ఏపీ నుంచి, 1730 ఇతర రాష్ట్రాల నుంచి, 371 ఇతర దేశాల నుంచి..మొత్తంగా..10 వేల 884 మంది కోవిడ్ – 19 బారిన పడ్డారని తెలిపింది. 

corona ap

Read: టీడీపీ కీలక నేతలు అరెస్ట్

Related Posts