తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు..జిల్లాల వారీగా కేసుల వివరాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణలో కరోనా కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. నిత్యం 3 నుంచి 5 వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండేవి. కానీ ప్రస్తుతం 2 వేలకంటే తక్కువగా నమోదువుతున్నాయి.తాజాగా…గత 24 గంటల్లో 1,302 కేసులు నమోదయ్యాయని, 2,230 మంది ఒక్కరోజే కోలుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,72,608 కు చేరాయి. మొత్తం రాష్ట్రంలో ఈ వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 1,41,930గా ఉంది. ఒక్క రోజులో 09 మంది చనిపోయారని వెల్లడించింది. కోలుకున్న వారి రేటు 82.22 శాతంగా ఉండగా, మరణాల రేటు 0.60గా ఉంది.

ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 29 వేల 636గా ఉందని, నివాసాలు / సంస్థల ఐసోలేషన్ చికిత్స పొందుతున్న వారు 22 వేల 990 గా తెలిపింది. ఒక్క రోజులో 31 వేల 095 పరీక్షలు నిర్వహించినట్లు, మొత్తం పరీక్షల సంఖ్య 25 లక్షల 19 వేల 315 గా ఉందని తెలిపింది.సాధారణ పడకలు 12 వేల 284 అందుబాటులో ఉన్నాయని, 415 బెడ్స్ లో రోగులు ఉన్నారని, మొత్తం 11 వేల 809 బెడ్స్ ఖాళీగా ఉన్నాయని వెల్లడించింది.
ఆక్సిజన్ పడకలు 05 వేల 861 అందుబాటులో ఉన్నాయని, 1,424 బెడ్స్ లో రోగులు ఉన్నారని, మొత్తం 04 వేల 437 బెడ్స్ ఖాళీగా ఉన్నాయని వెల్లడించింది.
ఐసీయూ పడకలు 02 వేల 251 అందుబాటులో ఉన్నాయని, 745 బెడ్స్ లో రోగులు ఉన్నారని, మొత్తం 1506 బెడ్స్ ఖాళీగా ఉన్నాయని వెల్లడించింది.

జిల్లాల వారీగా కేసులు :
ఆదిలాబాద్ 08. భద్రాద్రి కొత్తగూడెం 29. జీహెచ్ఎంసీ 266. జగిత్యాల 34. జనగామ 18. జయశంకర్ భూపాలపల్లి 0. జోగులాంబ గద్వాల 18. కామారెడ్డి 14. కరీంనగర్ 102. ఖమ్మం 35. కొమరం భీం ఆసిఫాబాద్ 8. మహబూబ్ నగర్ 24. మహబూబాబాద్ 45.మంచిర్యాల 20. మెదక్ 16. మేడ్చల్ మల్కాజ్ గిరి 24. ములుగు 15. నాగర్ కర్నూలు 37. నల్గొండ 70. నారాయణపేట 4. నిర్మల్ 13. నిజామాబాద్ 50. పెద్దపల్లి 20. రాజన్న సిరిసిల్ల 23. రంగారెడ్డి 98. సంగారెడ్డి 54. సిద్దిపేట 92. సూర్యాపేట 26. వికారాబాద్ 10. వనపర్తి 25. వరంగల్ రూరల్ 18. వరంగల్ అర్బన్ 62. యాదాద్రి భువనగిరి 24. మొత్తం : 1302

Related Posts