భారత్ లో 10 లక్షలు దాటిన కరోనా కేసులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భారత్ లో క‌రోనా వైర‌స్ ఉగ్ర‌రూపం దాల్చుతోంది. ఈ మ‌హ‌మ్మారి పంజా విస‌ర‌డంతో దేశ‌వ్యాప్తంగా పాజిటివ్‌ కేసులు భారీగా న‌మోద‌వుతున్నాయి. నిన్న రికార్డు స్థాయిలో 32,695 కేసులు న‌మోద‌వ‌గా, ఈ రోజు 35వేల‌కు ద‌గ్గ‌ర‌గా న‌మోద‌య్యాయి. దేశంలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 34,956 మంది క‌రోనా పాజిటివ్ లుగా తేలారు. ఇప్ప‌టివ‌ర‌కు 687 మంది క‌రోనాతో మృతి చెందారు.

దీంతో దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌రకు క‌రోనా కేసుల సంఖ్య 10,03,832కు చేర‌గా, మ‌ర‌ణాలు 25,602కు పెరిగాయి. మొత్తం పాజిటివ్ కేసుల్లో 3,42,473 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 6,35,757 మంది కోలుకున్నారు. ఈ మేరకు తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ కరోనా వైరస్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. రోజురోజుకీ కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్ప‌టికే ఈ వైర‌స్ బారిన ప‌డి ప‌లువురు ప్ర‌ముఖులు కన్నుమూసిన విష‌యం తెలిసిందే. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి.

తాజాగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,39,50,035 నమోదు కాగా, కరోనాతో మొత్తం ఇప్పటివరకూ 5,92,696 మంది మరణించారు. ఇక ప్రస్తుతం 50,77,646 యాక్టీవ్ కేసులు ఉండగా, 82,79,182 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Related Tags :

Related Posts :