లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

భారత్ లో 12 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

Published

on

భారత్ లో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. వారం రోజులుగా 32 వేల‌కు పైగా పాజ‌టివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. నిన్న 37 వేల‌కుపైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. గురువారం రికార్డు స్థాయిలో 45 వేల‌కుపైగా మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతో దేశంలో క‌రోనా కేసులు 12 ల‌క్ష‌లు దాటాయి. దేశవ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 45,720 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.

దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 12,38,635కు చేరింది. అదేవిధంగా ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల్లో 4,26,167 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, మ‌రో 7,82,606 మంది బాధితులు కోలుకున్నారు. ఉద‌యం వ‌ర‌కు కొత్త‌గా 1129 మంది మ‌ర‌ణించారు. దేశంలో ఒకేరోజు న‌మోదైన క‌రోనా మ‌ర‌ణాల్లో ఇదే అత్య‌ధికం. దీంతో ఇప్ప‌టివ‌రకు క‌రోనాతో మ‌రణించిన‌వారి సంఖ్య 29,861కు పెరిగింది. ‌

దేశంలో జూలై 22 నాటికి 1,50,75,369 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి ప్ర‌క‌టించింది. నిన్న ఒకేరోజు దేశ‌వ్యాప్తంగా 3,50,823 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని వెల్ల‌డించింది.