ఏపీలో పదివేలకు తగ్గకుండా నమోదవుతున్న కరోనా కేసులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రోజువారీగా జరుగుతున్న పరీక్షల్లో పదివేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. కరోనా టెస్టులు వేగవంతంగా జరుగుతుండటంతో కేసుల నమోదు సంఖ్య అలానే ఉంది. గడిచిన 24గంటలు అంటే గురువారం ఉదయం 9గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకూ నమోదైన కేసుల సంఖ్య 10వేల 376గా ఉన్నాయి. 61వేల 699మందికి పరీక్షలు జరిపినట్లు అధికారులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 31-07-2020 ఉదయం నాటికి 19లక్షల 51వేల 776శాంపిల్స్ పరీక్షించారు.సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 3వేల 822గా ఉంది. కోవిడ్ వల్ల గుంటూరులో 13మంది, అనంతపూర్ లో 9మంది, కర్నూల్ లో ఎనిమిది మంది, చిత్తరూలో ఏడుగురు, తూర్పుగోదావరిలో ఏడుగురు, ప్రకాశంలో ఆరుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, నెల్లూరులో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు, కడపలో ఒక్కరు, కృష్ణా జిల్లాలో ఒక్కరు, విజయనగరంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.కరోనా సమాచారం ఇక నుండి మీ చేతుల్లోనే:
* కరోనా సంబంధించిన అధికారిక సమాచారం కోసం వాట్సప్ చాట్ బాట్ నంబర్ (8297-104-104) Hi, Hello, Covid అని మెసేజ్ చేయండి.
* స్మార్ట్ ఫోన్ లేని వారు (8297-104-104)కు ఫోన్ చేసి IVRS ద్వారా కరోనాకు సంబంధించిన సమాచారం, సహాయం పొందవచ్చు.
* 104 టోల్ ఫ్రీ కు ఫోన్ చేసి కరోనా సంబంధించిన వైద్య సమస్యలు తెలుపవచ్చు.
* వైఎస్సార్ టెలి మెడిసిన్ నెంబరు 14410 కు మిస్డ్ కాల్ ఇచ్చి ఫోన్ ద్వారా డాక్టర్ ను సంప్రదించవచ్చు.
* https://esanjeevani.com/ వెబ్ సైట్ ద్వారా డాక్టర్ ను వీడియో కాల్ లో సంప్రదించి, కరోనాకు సంబంధించిన వైద్య సహాయం పొందవచ్చు.
* కొవిడ్ 19 పై సమచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది COVID-19 AP app. క్రింద లింక్ నుంచి ఆప్ డౌన్లోడ్ చేసుకోండి. రాష్ట్రంలో కోవిడ్ సమాచారం తెలుసుకోండి. https://play.google.com/store/apps/details?id=com.entrolabs.apcovid19


Related Posts