Corona cases reached to 283 in Telangana, 62 people are tested positive today

తెలంగాణలో 283కు చేరిన కరోనా కేసులు..ఇవాళ ఒక్కరోజే 62 మందికి పాజిటివ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 62పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 62 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 283కు పెరిగింది. హైదరాబాద్‌లో అత్యధికంగా 139 కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకు కరోనాతో 11 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు డిశ్చార్జ్ లు, మరణాలు కలుపుకుంటే 326 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. 

రోజురోజుకూ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో జనాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఒకవైపు పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 33 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 11 మంది మరణించారు. ప్రస్తుతానికి గాంధీ, ఉస్మానియా, కింగ్ కోఠి, చెస్టు ఆస్పత్రి, ఫీవర్ ఆస్పత్రుల్లో 283 మంది చికిత్స పొందుతున్నారు.

మరోవైపు ఐసోలేషన్ కోసం నెగెటివ్ వచ్చిన వారిని కూడా ప్రభుత్వం 14 రోజులు క్వారంటైన్ ఉంచుతుందో వారు కూడా వందల సంఖ్యలో ఉన్నారు. రోజురోజుకు పెరుగుతున్న సంఖ్య కూడా మర్కజ్ నుంచి వచ్చిన వారికి సంబంధించిన సంఖ్యగా చెబుతున్నారు. జిల్లాల వారిగా వివరాలను ఇవాళ ఆరోగ్య శాఖ విడుదల చేసింది. ఇప్పటికే ఐసోలేషన్ వార్డులో ఉన్నవారికి ఎప్పటికప్పుడు టెస్టులు చేయడం, 14 రోజుల తర్వాత మరోసారి టెస్టులు చేసిన తర్వాతనే వారిని డిశ్చార్జ్ చేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా మర్కత్ నుంచి వారికి సంబంధించి మొదట స్క్రీనింగ్ చేసిన తర్వాత వారి శాంపిల్స్ ను టెస్టుకు పంపిస్తున్నారు. అప్పుడు పాజిటివ్ లక్షణాలు కనిపించినట్లైతే వారిని 14 రోజులపాటు పూర్తిగా ఐసోలేషన్ వార్డులో ఉంచుతున్నారు. ఒకవేళ నెగెటివ్ వచ్చినా కూడా 14రోజులపాటు క్వారంటైన్ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేస్తున్నారు. 

హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న రంగారెడ్డి, మేడ్చల్, మెదక్ జిల్లాల్లో కూడా విపరీతమైన కేసులు నమోదు అవుతున్నాయి. వరంగల్ అర్బన్ లో 23, నిజామాబాద్ లో 19, మేడ్చల్ లో 12, ఆదిలాబాద్ జిల్లాలో 10 కేసులు నమోదు అయ్యాయి. దాదాపు 24 జిల్లాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 

అయితే డిశ్చార్జ్ సంఖ్య మాత్రం చాలా తక్కువగా కనిపిస్తోంది. హైదరాబాద్ లో 10, కరీంనగర్ లో ఇండోనేషియాకు సంబంధించిన 11 మంది డిశ్చార్జ్ అయ్యారు. మర్కత్ నుంచి ఢిల్లీ యాత్రకు ఎవరైతే వెళ్లారో వారికి సంబంధించిన కేసులు ఎక్కువగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. 
 

Related Tags :

Related Posts :