కరోనాలో బ్రెజిల్‌ని దాటేసిన భారత్.. ఒక్కరోజులో 55వేలకు దగ్గరగా కేసులు!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భారతదేశంలో రికార్డు స్థాయిలో కరోనా రోగుల సంఖ్య పెరిగిపోతోంది. గత 24గంటల్లో భారతదేశంలోనే బ్రెజిల్ కంటే అత్యధిక కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం సోకిన వారి సంఖ్య 17 లక్షలు దాటగా.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా లెక్కల ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 17 లక్షల 50 వేల 724 మందికి కరోనా సోకింది. వీరిలో 37,364 మంది మరణించగా, 11 లక్షల 45 వేల 629 మంది కోలుకున్నారు. 24 గంటల్లో, కొత్తగా 54 వేల 736 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 853మంది చనిపోయారు.కరోనా సోకిన దేశాల సంఖ్య ప్రకారం భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. కరోనా మహమ్మారి వల్ల యునైటెడ్ స్టేట్స్ ఎక్కువగా ప్రభావితం అవగా.. తర్వాత బ్రెజిల్ ఎక్కువగా ఎఫెక్ట్ అయింది. 10 లక్షల జనాభాకు సోకిన కేసులు మరియు మరణాల గురించి మాట్లాడితే, ఇతర దేశాల కంటే భారత్ మంచిగానే ఉంది. భారతదేశం కంటే ఎక్కువ కేసులు అమెరికా (4,763,983), బ్రెజిల్ (2,708,876) లో ఉన్నాయి. దేశంలో కరోనా కేసులు పెరిగే వేగం కూడా ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. అయితే ఒక్కరోజు కేసుల విషయానికి వస్తే బ్రెజిల్‌ని కూడా భారత్ దాటేసింది.

కరోనా ఎక్కువగా ప్రభావితమైన దేశాల జాబితాలో అమెరికా ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది. ఇప్పటివరకు 47.63 లక్షలకు పైగా ప్రజలు కరోనాకు గురయ్యారు, లక్షా 57 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో అమెరికాలో 58 వేల మందికి కొత్తగా కరోనా రాగా, 1102 మంది చనిపోయారు. అదే సమయంలో, కరోనా బ్రెజిల్లో వినాశనం కొనసాగిస్తోంది. 24 గంటల్లో బ్రెజిల్‌లో 42 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో 5 లక్షల 67 వేల 730 క్రియాశీల కేసులు కరోనా ఉండగా.. అందులో అత్యంత చురుకైన కేసులు మహారాష్ట్రలో ఉన్నాయి. మహారాష్ట్రలోని ఆసుపత్రులలో లక్ష మందికి పైగా కరోనా సోకిన వారు చికిత్స పొందుతున్నారు. తమిళనాడు రెండో స్థానంలో, ఢిల్లీ మూడో స్థానంలో, గుజరాత్ నాలుగవ స్థానంలో, పశ్చిమ బెంగాల్ ఐదవ స్థానంలో ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో అత్యంత చురుకైన కేసులు ఉన్నాయి.

Related Posts