కరోనా : నవంబర్ నాటికి చైనా వ్యాక్సిన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

నవంబర్ నాటికి సాధారణ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం ఆ దేశంలో నాలుగు కరోనా వైరస్ వ్యాక్సిన్ లు తయారవుతున్నాయి. క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న ఈ వ్యాక్సిన్లను అత్యవసర సేవలు అందిస్తున్న వారికి ఇచ్చినట్లు తెలిపారు.


చుషుల్: చైనా, ఇండియాల మధ్య యుద్ధమంటూ వస్తే…ఇక్కడే


జులై నెలలో వ్యాక్సిన్ లు ఇచ్చామని, థర్డ్ ట్రయల్స్ సజావుగా సాగుతున్నాయన్నారు. తాను మొదట ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్లు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాలేదన్నారు. ఔషధ దిగ్గజం చైనా నేషనల్ ఫార్మాస్యూటికల్ గ్రూప్ (సినోఫార్మ్), యూఎస్‌ కాన్సినో బయోలాజిక్స్ 6185 చే అభివృద్ధి చేయబడుతున్న నాలుగవ కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ను చైనా సైన్యం ఉపయోగించడానికి జూన్‌ నెలలో ప్రభుత్వం ఆమోదం తెలిపింది.మూడవ దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ముగిసిన తరువాత 2020 చివరి నాటి ఈ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని సినోఫార్మ్‌ జూలైలోనే ప్రకటించింది. వైరస్‌ నిర్మూలనలో భాగంగా వ్యాక్సిన్‌ను కనిపెట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే రష్యా ఒక వ్యాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కానీ ఈ టీకాపై పలు విమర్శలు చెలరేగుతున్నాయి.

Related Posts