-
Home » ఏం కాదులే అనుకుంటే కుదరదు : చలికాలంలో విజృంభిస్తున్న కరోనా..పెరుగుతున్న మరణాలు
National
ఏం కాదులే అనుకుంటే కుదరదు : చలికాలంలో విజృంభిస్తున్న కరోనా..పెరుగుతున్న మరణాలు
Published
4 months agoon
By
nagamani
Corona effect in winter Season : కరనా వైరస్ మహమ్మారి కలకలం మొదలై ఏడాది కావస్తోంది. అయినా ఏమాత్రం తగ్గట్లేదు. మరోవైపు వ్యాక్సిన్ ఎప్పటికి వస్తోందో తెలిదు. వచ్చినా ఎంత వరకూ ఫలితం ఉంటుందో చెప్పే పరిస్థితి లేదే. ఈ క్రమంలో శీతాకాలం వచ్చేసింది. శీతాకాలం అంటే శ్వాసకోస సమస్యల కాలం. కరోనా కూడా శ్వాసకు సంబంధించిన వైరస్సే. దీంతో ఈ శీతాకాలంలో కరోనా విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జాగ్రత్తగా లేకుండా మహమ్మారికి బలయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.
హా..కరోనా వచ్చి ఏడాది కావస్తోంది. ఇంకా ఎంతకాలం ఈ మాస్కులు..చేతులు కడుక్కోవటాలు అని లైట్ తీసుకుంటే కరోనాకు గురి కావాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. రోజురోజుకు చలి పెరుగుతున్న ఈ శీతాకాలంలో కరోనా వైరస్ తీవ్రత 40 శాతం పెరిగిందని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో కరోనా మరణాలు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి.
కరోనాను తేలిగ్గా తీసుకోవద్దు..తగ్గిపోతోందని..వ్యాక్సిన్ వచ్చేస్తోందని అస్సలు లైట్ తీసుకోవద్దు..ఇండియాలో తగ్గిపోతోంది కదా అని ఏం కాదులే అనుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే 2019లో ఇదే శీతాకాలంలో కరోనా వైరస్ ఎంతగా విజృంభించిందో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. మళ్లీ ఇప్పుడు చలికాలం రాగానే ప్రపంచవ్యాప్తంగా కొత్త కేసులు, మరణాలు బాగా పెరుగుతున్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిందే.
చలికాలంలో కరోనా నుంచి రక్షించే కొత్త ఆయుధం “ఫ్లూ వ్యాక్సిన్”
ప్రపంచవ్యాప్తంగా కొత్తగా మంగళవారం (నవంబర్ 10,2020)నాటికి 5,33,118 కేసులొచ్చాయి.దీంతో మొత్తం కేసుల సంఖ్య 5కోట్ల 17లక్షల 87వేల 773కి చేరింది. ఈ క్రమంలో కరోనాతో మంగళవారం ఒక్కరోజే ప్రపంచ వ్యాప్తంగా 9వేల 73 మంది చనిపోయారు. ఒక్క రోజులో ఇంత ఎక్కువ మంది చనిపోవడం కరోనా ఉదృతికి నిదర్శనమని ఒప్పుకోకతప్పదు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,79,963కి చేరింది.
ప్రస్తుతం రికవరీ కేసులు 3,63,60,973కి చేరాయి. యాక్టివ్ కేసులు 1,41,48,378కి చేరాయి. గత రెండు నెలల్లో యాక్టివ్ కేసులు 40 శాతం పెరిగాయి. ప్రస్తుతం 94,612 మందికి కరోనా తీవ్రంగా లేదా అతి తీవ్రంగా ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో కరోనా సోకిన ప్రతి 100 మందిలో ఇద్దరు లేదా ముగ్గురు చనిపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
అమెరికాలో కరోనా తీవ్రత మామూలుగా లేదు. దాని ప్రతాపం చూపిస్తోంది. నవంబర్ 10 ఒక్కరోజు అమెరికాలో 1,32,360 కొత్త కేసులు నమోదయ్యాయి అంటే అక్కడ తీవ్రత ఎలా ఉందో ఊహించుకోవచ్చు. దీంతో మొత్తం కేసులు 1,05,55,970కి చేరాయి. అంతేకాదు… నిన్న 1316 మంది చనిపోయారు. మొత్తం మరణాలు 2,45,771కి చేరాయి. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని లెక్కలు చెబుతున్నాయి.
ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్‌లో ఉంది. అమెరికా తరువాత బ్రెజిల్, ఫ్రాన్స్, రష్యా,ఇండియాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా తర్వాత ఇండియా, ఇటలీ, బ్రెజిల్, పోలాండ్, ఫ్రాన్స్, రష్యా… టాప్ 7లో ఉండగా..మొత్తం కరోనా మరణాల్లో అమెరికా టాప్ ఉంది. బ్రెజిల్, ఇండియా, మెక్సికో, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.
రోజువారీ మరణాల్లో అమెరికా టాప్‌లో ఉండగా… ఫ్రాన్స్ (857), ఇటలీ (580), బ్రిటన్ (532), ఇండియా తర్వాతి పొజిషన్లలో ఉన్నాయి. మరణాలు ఎక్కువగా సంభవిస్తున్న టాప్ 10 దేశాల్లో యూరప్ దేశాలు 5 ఉన్నాయి. అంటే యూరప్‌లో కరోనా తీవ్రంగా ఉందని అర్థమవుతోంది.
ఇండియాలో కొత్తగా 38,073 వచ్చాయి. మొత్తం కేసులు 85,91,730కి చేరాయి. తాజాగా 448 మంది చనిపోవడంతో… మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,27,059కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.5 శాతంగా కొనసాగుతోంది. కొత్తగా 42,033 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 79,59,406కి చేరింది. దేశంలో రికవరీ రేటు 92.6 శాతంగా ఉంది. ప్రస్తుతం ఇండియాలో 5,05,265 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
You may like
-
అవినీతి కేసులో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడికి మూడేళ్ల జైలు శిక్ష
-
బ్రెజిల్, సౌతాఫ్రికా, యూకే కొత్త వేరియంట్లు ఏంటి? అసలు కరోనా వ్యాక్సిన్లు పనిచేస్తాయా?
-
కలికాలం.. తనను తానే పెళ్లి చేసుకున్న మహిళ.. మరి సంసారం ఎవరితో చేస్తుందో..
-
భారత విద్యుత్ కేంద్రాలను టార్గెట్ చేసిన చైనా..ముంబై పవర్ కట్ వాళ్ల పనే
-
టీకా వేశారా..అబ్బే తెలియనే లేదు – మోడీ
-
కొత్త టెన్షన్: కిడ్స్‌పై కోవిడ్ పంజా

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న అమిత్ షా

లెగ్ స్లిప్‌లో స్టన్నింగ్ క్యాచ్.. వావ్.. భలే డైవ్ చేశాడు.. వీడియో వైరల్!

అవినీతి కేసులో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడికి మూడేళ్ల జైలు శిక్ష

ఏడేళ్లకే పెళ్లి చేశారు.. 12ఏళ్ల తర్వాత కోర్టుకు యువతి
