లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Business

కరోనా ఎఫెక్ట్..లాక్ డౌన్ : ఒక్కరోజే రూ 13.88 లక్షల కోట్ల సంపద ఆవిరి

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో సోమవారం స్టాక్‌మార్కెట్లు కుప్పకూలాయి. ఇన్వెస్టర్లు పానిక్‌ సెల్లింగ్‌కు దిగడంతో మార్కెట్‌లో మరో మహాపతనం నమోదైంది.

Published

on

Corona Effect : Lockdown, Steam worth Rs 13.88 lakh crores per day

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో సోమవారం స్టాక్‌మార్కెట్లు కుప్పకూలాయి. ఇన్వెస్టర్లు పానిక్‌ సెల్లింగ్‌కు దిగడంతో మార్కెట్‌లో మరో మహాపతనం నమోదైంది.

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో సోమవారం స్టాక్‌మార్కెట్లు కుప్పకూలాయి. ఇన్వెస్టర్లు పానిక్‌ సెల్లింగ్‌కు దిగడంతో మార్కెట్‌లో మరో మహాపతనం నమోదైంది. ఓ దశలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ పదిశాతంపైగా పతనమవడంతో ట్రేడింగ్‌ను 45 నిమిషాల పాటు నిలిపివేశారు. వైరస్‌ ప్రభావం దీర్ఘకాలం కొనసాగుతుందనే ఆందోళనతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. 

బ్యాంకింగ్‌ షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. మొత్తం మీద బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 3934 పాయింట్ల నష్టంతో 25,981 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 1136 పాయింట్లు పతనమై 7610 పాయింట్ల వద్ద ముగిసింది. 

ఒక్కరోజులో కీలక సూచీలు ఈ స్ధాయిలో పతనమవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం​. స్టాక్‌మార్కెట్లు పాతాళానికి దిగజారడంతో ఒక్కరోజే రూ 13.88 లక్షల కోట్ల మదుపుదారుల సంపద ఆవిరి అయింది. గత నెలలో ఇన్వెస్టర్లు రూ 56.22 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశారు.
 

See Also | కరోనా ఎఫెక్ట్ : షేర్ల బేజారుతో బంగారానికి డిమాండ్

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *