కరోనా ఎఫెక్ట్ : పదో తరగతి పరీక్షలు రద్దు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఏపీలో పదో తరగతి పరీక్షలను రద్దు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 2020 పరీక్షలకు నమోదు చేసుకున్న పదో తరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు తెలిపింది. ఎస్ఎస్ సీ, ఓఎస్ఎస్ సీ, ఒకేషనల్ పరీక్షలన్నీ రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. పదో తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమైన హాట్ టికెట్లు పొందిన విద్యార్థులందరికీ ఎలాంటి గ్రేడ్ పాయింట్లు ఇవ్వకుండా ఉత్తీర్ణుల్ని చేసినట్లు ప్రకటించారు.

ఇప్పటికే ఏపీలో ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ఎంసెట్ సహా 8 కామన్ ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా నేపథ్యంలో ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా వేస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 3వ వారంలో ఎంసెట్ ఎంట్రన్స్ టెస్టు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆన్ లైన్ కోర్సుల విధివిధానాలు త్వరలో రూపొందిస్తామని తెలిపారు.

ఏపీలో ఎంసెట్ తోపాటు ఎనిమిది కామన్ ఎంట్రన్స్ టెస్టులు వాయిదా వేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను మంత్రి ఆదిమూలపు విడుదల చేశారు. ఎంసెట్ తోపాటు ఐసెట్, ఈసోట్, లాసెట్, ఎడ్ సెట్ మరియు పీజీ పరీక్షలకు సంబంధించినటువంటి తేదీలు ప్రకటించారో ఆయా తేదీలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ముఖ్యంగా డీగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు మంత్రి సురేష్ ప్రకటించారు. వీటన్నిటిని సెప్టెంబర్ మూడో వారం తర్వాత ఏఏ పరీక్షలు నిర్వస్తారో ఫైనల్ చేస్తామని తెలిపారు. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్ తో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

Related Posts