మానసిక ఒత్తిడిలో కరోనా రోగులు, 6 నెలల్లో 67, 780 ఫోన్ కాల్స్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Corona patients under stress : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వచ్చిన బాధితుల్లో చాలా మంది మానసిక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని తేలింది. భయం, ఆందోళన, ఒత్తిడి, నిరాశ, ఇతరత్రా లక్షణాలతో బాధ పడుతున్నారని నిర్ధారించారు. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బాధితుల నుంచి పెద్దఎత్తున కాల్స్ వస్తున్నాయి.



గత ఆరు నెలల కాలంలో 67 వేల 780 ఫోన్స్ దీనికి సంబంధించినవే ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోవిడ్ తో బాధ పడుతున్న రోగులకు మానసిక స్వస్థతను చేకూర్చడానికి టోల్ ఫ్రీ నెంబర్ (1800-599-4455)ని ఏర్పాటు చేసింది. మానసిక ప్రశాంతతను కల్పించడానికి అన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో సైకియాట్రిస్టులను అందుబాటులో ఉంచింది.



మరోవైపు ప్రైవేటు ఆసుపత్రులపై కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. అధిక ఫీజులను నియంత్రించేందుకు బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకొనేందుకు ప్రభుత్వం ఒక వాట్సాప్ నెంబర్ ను క్రియేట్ చేసింది. దీంతో ఆ నంబర్ కు ఇప్పటి వరకు 334 ప్రైవేటు ఆసుపత్రుల నుంచి 1,409 ఫిర్యాదులు వచ్చినట్లు వైద్య ఆరోగ్య తెలిపింది. వీటిల్లో 1,261 పరిష్కరించగా..ఇంకా 148 పురోగతిలో ఉన్నాయని వెల్లడించింది.



వివిధ నెలల్లో మానసిక ఆరోగ్యంపై వచ్చిన ఫోన్ కాల్స్ :
జూన్ : 2,963
జులై : 23,716
ఆగస్టు : 14,393
సెప్టెంబర్ : 14,587
అక్టోబర్ : 8,316
నవంబర్ : 3,805

Related Tags :

Related Posts :