హైదరాబాద్ ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో 15 మంది వైద్య సిబ్బందికి కరోనా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

హైదరాబాద్ ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో కరోనా కలకలం రేపింది. ఆస్పత్రిలో వైద్య సేవలందిస్తున్న 15 మందికి కరోనా సోకింది. దీంతో చికిత్స చేసేందుకు వైద్య సిబ్బంది జంకుతున్నారు. ఓపీ కేసుల ద్వారా కరోనా వ్యాపిస్తోందని అనుమానం చేస్తున్నారు. ఓపీ సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది భయపడుతున్నారు.హైదరాబాద్ నగర్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా కోవిడ్ ఆస్పత్రుల్లో సపర్యలు చేస్తున్న వార్డీస్ కూడా కరోనా బారిన పడుతున్నారు. గతంలో గాంధీతోపాటు కింగ్ కోఠి రకరకాల ఆస్పత్రులకు సంబంధించిన వైద్యులు కరోనా బారిన పడ్డారు. తాజాగా చెస్ట్ ఆస్పత్రికి సంబంధించిన 15 మంది కరోనా బారిన పడ్డారని తెలుస్తోంది. డాక్టర్లు, నర్సులతోపాటు కిందిస్థాయి ఆయాలతోపాటు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నగరంలోని కరోనా ఆస్పత్రులు అందులో పని చేసే వైద్య సిబ్బంది, నర్సులు, కిందిస్థాయి సిబ్బంది కూడా షిప్టుల ప్రకారం డ్యూటీలు చేస్తున్నా కూడా ఒకరి తర్వాత మరొకరికి లక్షణాలు రావడం, కరోనా బారిన పడటం వైద్య ఆరోగ్యశాఖను కలవరపాటుకు గురిచేస్తోంది. ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కరోనా బాధితులకు సపర్యలకు సంబంధించి, అత్యవసర సేవలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం,వైద్య ఆరోగ్య శాఖ ముందుంటుందని చెబుతున్నారు.కరోనా నిర్ధారణ అయిన 15 మందిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారని ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది. పూర్తిస్థాయిలో కరోనా వారియర్స్ ఉన్నారో వారికి కూడా కరోనా పాజిటివ్ గా తేలిన తర్వాత సాధారణ ప్రజలు ఎవరైనా కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారో వారికి కూడా అంతేస్థాయిలో చికిత్స అందిస్తామని చెబుతున్నారు. చికిత్స అందిస్తున్న వైద్యులకు కరోనా లక్షణాలుంటే వారికి కూడా టెస్టులు చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

Related Posts