achennayudu

మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు కరోనా సోకింది. నిన్న ఉదయం నుంచి జలుబు చేయడంతో అచ్చెన్నాయుడుకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ టెస్టుల్లో ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలింది. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న ఆయనకు గుంటూరు రమేష్ ఆస్పత్రిలో కరోనా చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్ రావడంతో ఆరోగ్య పరిస్థితిపై హైకోర్టుకు లేఖ రాయాలని ప్రభుత్వం భావిస్తోంది. అచ్చెన్నాయుడుకు కరోనా రావడంతో హైకోర్టుకు లేఖ రాయాలని నిర్ణయించారు. అనారోగ్య కారణాల రీత్య హైకోర్టు ఆదేశాలతో గుంటూరు రమేష్ హాస్పిటల్ లో అచ్చెన్నాయుడు గత కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు.

గతంలో ఈఎస్ ఐ స్కామ్ లో ఆయన్ను అరెస్టైన అనంతరం ఏసీబీ కోర్టు, హైకోర్టులు ఆయనకు బెయిల్ పిటిషన్ లు తిరస్కరించాయి. అయితే హైకోర్టులో మాత్రం ఆయన్ను ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చించాలన్న పిటిషన్ పై మాత్రం సానుకూలంగా స్పందించి.. గుంటురు రమేష్ ఆస్పత్రిలో గత కొంతకాలంగా ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

ఆయనకు పైల్స్ ఆపరేషన్ జరిగింది కాబట్టి దానికి సంబంధించిన టెస్టులు చేయడానికి బయటి నుంచి కొంతమంది సిబ్బంది వచ్చారు. ఆ టెస్టులు చేసే క్రమంలో వారి ద్వారా ఆయనకు కరోనా సోకిందని ఆస్పత్రి వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొన్న ఒక టెస్టు చేయడానికి సిబ్బంది బయట నుంచి వచ్చారు.

నిన్నటి నుంచి ఆయనకు జలుబు చేసిన నేపథ్యంలో వెంటనే కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే ఆయన హెల్త్ కండీషన్ పట్ల వారానికి ఒకసారి ఆస్పత్రి నివేదిక తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్ వచ్చిందని హైకోర్టుకు ఆస్పత్రి యాజమాన్యం రిపోర్టు పంపింది.

మరోవైపు ఆస్పత్రిలోనే చికిత్స చేయడానికి సౌకర్యాలు ఉన్నాయని, కోవిడ్ పేషెంట్లకూడా తాము ఇక్కడ చికిత్స చేస్తామని ఆ లేఖలో వారు పేర్కొన్నట్టు చెబుతున్నారు. అయితే వీరి పట్ల అచ్చెన్నాయుడు బంధువులు, అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జైలులో కరోనా పేషెంట్ల మధ్య అచ్చెన్నాయుడిని పెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. అచ్చెన్నాయుడుకు కరోనా రావడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related Posts