Home » రాజస్థాన్ మహిళకు 31 సార్లు కరోనా పాజిటివ్
Published
1 month agoon
Rajasthan woman : రాజస్థాన్‌కు చెందిన శారద అనే మహిళకు 5 నెలల్లో 31 సార్లు కోవిడ్ పాజిటివ్ రావడం సంచలనం రేపుతోంది. 31 సార్లు కోవిడ్ పాజిటివ్ వచ్చినా జ్వరం, నీరసం, దగ్గు, జ్వరం వంటి కరోనా లక్షణాలు శారదలో కనిపించడం లేదు. లక్షణాలు కనిపించకపోయినా క్రమంగా ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. కరోనా వైరస్ అంతు చిక్కని ప్రవర్తనకు అక్కడి డాక్టర్లు ఆశ్చర్య పోతున్నారు. రాజస్థాన్ భరత్పూర్ జిల్లాలోని ఆప్నాఘర్ ఆశ్రమంలో శారద ఉంటోంది. ఆమె మానసిక స్థితి సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆశ్రమంలో ఉంచారు.
అయితే ఆమెకు గతేడాది ఆగస్టు 20న తొలిసారి కరోనా సోకింది. దీంతో స్థానికంగా ఉన్న ఆర్బీఎం హాస్పిటల్లో శారదకు చికిత్స అందిస్తున్నారు. చికిత్స అందించిన తర్వాత 21 రోజులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 31 సార్లు పరీక్షలు నిర్వహించగా ప్రతీసారి ఆమెకు కరోనా పాజిటివ్‌గానే రిపోర్టులు వస్తున్నాయి. ఒక వ్యక్తి శరీరంలో కరోనా వైరస్ ఇంత సుదీర్ఘకాలం ఉండటం అనేది ఇప్పుడు వైద్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అంతేకాకుండా పైకి ఎటువంటి లక్షణాలు కనిపించకుండానే మనిషి ఆరోగ్యాన్ని క్షీణింప చేయడంపై వైద్య వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. దీంతో ఆమెను తదుపరి పరీక్షలు, చికిత్స కోసం జైపూర్‌లోని SMS హాస్పిటల్‌కు తరలించాలని వైద్యులు నిర్ణయించారు. కరోనా ఎంతకీ తగ్గకపోవడంతో వైద్యులు ఆయుర్వేద, హోమియో, అల్లోపతి మందులతో శారదకు చికిత్స అందిస్తున్నారు.
వరుడి తండ్రి ఆదర్శం : రూ.11 లక్షల కట్నం వద్దండీ..రూ.101 చాలు..
నీ గట్స్‌కు హ్యాట్సాఫ్.. రాత్రి వేళ దొంగను వెంటాడి పట్టుకున్న యువతి
భార్య శీలాన్ని శంకించిన కలియుగ భర్త
రిక్షా ఎత్తుకెళ్లారని.. ముగ్గురిని కరెంట్ స్థంభానికి కట్టి..రక్తం కారేలా కొట్టిన స్థానికులు
బీజేపీ నేత కుటుంబంలో నలుగురు ఉరి వేసుకుని ఆత్మహత్య
బురదలో మహిళను లాక్కెళ్లిన సెక్యూర్టీ గార్డు..ప్రభుత్వాసుపత్రిలో దారుణం