హైదరాబాద్ లో ప్రజల వద్దకే కరోనా పరీక్షలు : 20 సంచార వాహనాలు సిద్ధం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణలో కరోనా వ్యాపిస్తూనే ఉంది. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు ఎక్కువవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రికి వెళ్లి..పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుండడం..ఇబ్బందులు ఎదురవుతుండడంతో ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది.

ప్రస్తుతం బస్తీ దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ, జల్లా బోధనాసుపత్రుల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజల వద్దకు కరోనా నిర్ధారణ పరీక్షల కేంద్రం తరలిరానుంది. 20 సంచార వాహనాలను సిద్ధం చేశారు. కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న..కంటెన్ మెంట్ ప్రాంతాల్లో తొలుత వీటిని ఉపయోగిస్తారు.

2020, జులై 30వ తేదీ గురువారం నుంచి సేవలు ప్రారంభం కానున్నాయి. మరో 30 వాహనాలను వచ్చే వారంలో అందుబాటులోకి తీసుకరానున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి.
బస్సులో ఒకేసారి 10 మందికి నమూనాలను సేకరించేందుకు వీలుగా..ఒక్కో బస్సులో 10 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా యాంటీజెన్ పరీక్షలతో అక్కడికక్కడే ఫలితాలు వెల్లడవుతాయి.

పరీక్షలకు వినియోగించే పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు, గ్లౌజులు, ఇతర వస్తువులను ప్రభుత్వమే ఇవ్వనుంది. 20 బస్సుల ద్వారా రోజు 60 వేల నమూనాలను సేకరించనున్నారు. ఆక్సిజన్, వెంటిలెటర్ సౌకర్యాలు ఉన్నాయి. రోజుకు ఒక్క బస్సులో ఉన్న సిబ్బంది ఆరు గంటల పాటు సేవలందిస్తే..సుమారు 3 వేల నమూనాలను ఒక్క బస్సు ద్వారానే సేకరించడానికి అవకాశాలుంటాయని భావిస్తున్నారు.

Related Posts