corona Time Mahesh Babu And Sitara New Selfie

అందం మరింత పెరిగిపోతోంది : మహేష్ న్యూ లుక్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు వయస్సు పెరుగుతున్న కొద్ది అందం మరింతగా పెరిగిపోతోందా ? రోజు రోజుకు ముదరఛాయలు రాకుండా..కొత్త కొత్తగా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు ఈ హీరో. లెటెస్ట్ గా వస్తున్న ఫొటోలు చూస్తుంటే…ఆయన వయస్సు ఎంత అనేది చెప్పడం కష్టమంటున్నారు. ఓ కుర్రాడిలాగా కనిపిస్తుండడం అందర్నీ అలరిస్తోంది. కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ లు అన్నీ ప్యాకప్ కావడంతో అందరూ ఇంట్లోనే ఉంటూ..ఎంజయ్ చేస్తున్నారు.

హీరో మహేష్ బాబు..కూడా తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. జిమ్ చేయడం, పిల్లలతో ఆడుకోవడం, పాటలు పాడడం, అల్లరి పనులు చేయడం వంటివి చేస్తున్నాడు ఈ హీరో. దీనికి సంబంధించిన వాటిని మహేష్ భార్య నమ్రత అభిమానులకు పంచుకొంటోంది. ఇటీవలే పలు వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా..తన కూతురితో ఉన్న ఫొటోను మహేష్ బాబు ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా రిలీజ్ చేశాడు. ఈ ఫొటోలో ఇంకా అందంగా కనిపిస్తున్నాడు మహేష్. కూతురు సితారా నవ్వులు చిందిస్తున్న ఈ ఫొటోను ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. 

రోజు రోజుకు కుర్రాడిలా మారిపోతున్నాడా అనిపిస్తుంది. డైట్, వర్కవుట్స్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇదే విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు కూడా. ఆరోగ్యం మీద తనకు శ్రద్ధ ఎక్కువని, ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పారు మహేష్. సింపుల్ గా ఉండడమే తనకిష్టమంటున్నారు. రానున్న రోజుల్లో మహేష్ ఎలా మారిపోతాడోనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Finding our reflections!! Mastering the mirror selfie with @sitaraghattamaneni ❤️❤️❤️

A post shared by Mahesh Babu (@urstrulymahesh) on

Read:  రాముడిగా సూపర్‌స్టార్..

Related Posts