466 మంది పోలీసులకు కరోనా : డీజీపీ గౌతం సవాంగ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

విశాఖలో ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ పర్యటించారు. డీజీపీ కార్యాలయానికి అనువైన భవనాలను సవాంగ్ పరిశీలించారు. విశాఖ పరిపాలనా రాజధానిగా మారుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ ఎదుర్కోవడంలో ఏపీ ఛాలెంజ్ గా తీసుకుందన్నారు. కరోనా నియంత్రణలో విశాఖ పోలీసుల కృషి అభినందనీయమన్నారు. ఇప్పటివరకు 466 మంది పోలీసులకు కరోనా సోకిందన్నారు. ఏపీ పోలీసులు 24/7 పని చేస్తున్నారని పేర్కొన్నారు.

డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ శనివారం విశాఖ నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. శనివారం ఉదయాన్నే కాపులుప్పాడలోని గ్రేహౌండ్స్‌ కార్యాలయాన్ని, ఏపీఐఐసీ భూములను పరిశీలించారు. గ్రేహౌండ్స్‌ ప్రధాన కార్యాలయం కోసం జగన్నాథపురంలో కేటాయించిన 380 ఎకరాలను, సింహాచలంలోని ప్రభుత్వ భూమిని పరిశీలించారు. విశాఖలో పోలీస్‌ ప్రధాన కార్యాలయాలు, ఇతర కార్యాలయాల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను చూశారు. రుషికొండ ఐటీ పార్కులోని ఓ భవనాన్ని డీజీపీ కార్యాలయం కోసం పరిశీలించారు. అదే కొండపై సీఐడీ కార్యాలయం కోసం భవనాలు చూడాలని చెప్పారు.

విశాఖకు కార్యనిర్వహక రాజధానిని తరలించే పనిలో అధికారులు ఉన్నారు. విశాఖలో వరుసగా కీలక అధికారులు పర్యటిస్తోన్నారు. ఇటీవలే డీజీపీ గౌతం సవాంగ్ విశాఖలో పర్యటించారు. ఇటీవలే విశాఖలో పర్యటించిన సీఎంవో ప్రిన్సిపల్, సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్, సీఎం ముఖ్య సలహాదారు ధనుంజయ్ రెడ్డి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి ప్రభుత్వ కార్యాలయాల కోసం భూముల అన్వేషణ చేస్తున్నారు. సీఎం కార్యాలయం, నివాసం, ఇతర వ్యవహారాలపై దృష్టి పెట్టారు.

Related Posts