లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

నిమ్స్ లో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్… స్క్రీనింగ్ కోసం 26 మంది వాలంటీర్లు ఎంపిక

Published

on

హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియ కొనసాగుతోంది. నిమ్స్ వైద్యులు ఇప్పటికే 26 మంది వాలంటీర్లను స్క్రీనింగ్ కోసం ఎంపిక చేశారు. వారిలో 20 మంది రక్తనమూనాలను సేకరించి ఆ శాంపిల్స్ ను సెంట్రల్ ల్యాబ్ కు పంపారు. ఆ శాంపిల్స్ రిపోర్టులు రాగానే ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. మరో వారం రోజుల్లోనే వ్యాక్సిన్ ప్రయోగాలకు నిమ్స్ లో అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. రిపోర్ట్స్ వచ్చాక వాలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించి నిమ్స్ ఆస్పత్రిని ఎంపిక చేశారు. ఐసీఎమ్మార్, భారత్ బయోటెక్ సంయుక్తంగా నిర్వహిస్తున్న క్లినికల్ ట్రయల్స్ లో దేశ వ్యాప్తంగా 12 ఆస్పత్రులను ఎంపిక చేశారు. అందులో నిమ్స్ ఒకటిగా నిలిచింది. అయితే ఆస్పత్రిలో ఇప్పటికే కోయాక్జిన్ అనే వ్యాక్సిన్ కు సంబంధించి ట్రయల్స్ ప్రక్రియ మొదలైంది.

ఇప్పటికీ 26 మంది వాలంటీర్లను సెలెక్ట్ చేసి వారి దగ్గరి నుంచి శాంపిల్స్ పంపారు. ముందు ఏదైతే వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమైన రోజు ఆరుగురు నుంచి రక్తనమూనాలను సేకరించి ఢిల్లీలోని ల్యాబ్స్ కు పంపారు. ఇవాళ మరో 20 మంది రక్తనమూనాలను సేకరించి వారి శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపారు. మొత్తం 26 వాలంటీర్లను ఎంపిక చేసి చేశారు.

ఈ 26 మంది రిపోర్టులు వచ్చాక వారిలో ఎవరినీ ఎంపిక చేయాలి? పూర్తి ఆరోగ్యవంతులకు మాత్రమే వ్యాక్సిన్ ప్రయోగం జరుగుతుంది. 26 మందిలో ఎంతమంది సెలెక్ట్ అవుతారు? ఎంత మంది అర్హత పొందుతారనే విషయం మరో మూడు రోజుల్లో తేలనుంది. మొత్తం 60 వాలంటీర్ల నుంచి శాంపిల్స్ కలెక్షన్ చేసి వారి మీద ప్రయోగం జరుపుతారని తెలుస్తోంది.

మరో వారం రోజుల్లో వ్యాక్సిన్ కు సంబంధించి ప్రయోగాలు ప్రారంభం అవుతాయని నిమ్స్ వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే నిమ్స్ డైరెక్టర్ మనోహర్, అతని ఆధ్వర్యంలో ఉన్న డాక్టర్ల బృందం కూడా ఐసీయూ సెటప్ ను ఏర్పాటు చేసి, వ్యాక్సిన్ కు సంబంధించిన ప్రయోగం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.

రక్తనమూనాలు సేకరించి వాలంటీర్లను వ్యాక్సిన్ మొదటి దశ ఎక్కించిన తర్వాత రెండు రోజులు అబ్జర్వేషన్ లో ఉంచి ఆ తర్వాత వారిని 14 రోజుల పాటు ఇంట్లో ఉంచి వారిలో ఎలాంటి మార్పులు వస్తున్నాయనేదానిపై కూడా క్షుణ్ణంగా అబ్జర్వేషన్ లో ఉంచనున్నారు. వారిలో ఎలాంటి మార్పులు వస్తాయో గమనించిన తర్వాత రెండో డోస్ ఎక్కించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు నిమ్స్ వైద్యులు చెబుతున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *