లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Health

టీకా ఎప్పుడు వస్తుందో చెప్పలేం…అప్పటి దాకా మాస్కే రక్ష

Published

on

Corona vaccine : కరోనా వైరస్ టీకా ప్రయోగాలు పరీక్షల దశలోనే ఉన్నాయని అవి వచ్చేంతవరకు మాస్కే మనకు రక్ష అని సీసీఎంబీ(సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా స్పృష్టం చేశారు.  వ్యాక్సిన్ వచ్చేంత వరకు భౌతిక దూరం పాటించటం, చేతులు శుభ్రం చేసుకోవడం, బహిరంగ ప్రదేశాల్లో మాస్కు వేసుకోవడం వంటి చర్యల ద్వారా వ్యాప్తిని అడ్డుకోవచ్చు’అని ఆయన వివరించారు.

కోవిడ్ వైరస్ రక్షణకు రోగనిరోధక శక్తిని పెంపోందిచే పోషక విలువలున్న ఆహారోత్పత్తి కరోనా ఎయిడ్ ను ఆయన గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ….టీకా ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా చెప్పలేమని… క్లినికల్ ట్రయల్స్ పూర్తై ఆరునెలల్లో టీకా వచ్చినా దాని ప్రభావం ఎంతకాలం ఉంటుందో తెలిసేందుకు మరో ఆరునెలలు పడుతుందని అన్నారు.టీకా అందరికీ చేరేందుకు మరో రెండు మూడేళ్లు పట్టవచ్చని అప్పటి వరకు మాస్కే మనకు రక్ష అని…. టీకా లేకుండానే వైరస్ ను ఎదుర్కోనేందుకు ప్రజలంతా సిధ్ధపడాలని సూచించారు. కరోనా రక్షణ చర్యలన్నీ పాటిస్తే కొంత కాలానికి నిరోధకత ఏర్పడుతుందని, తద్వారా సహజ సిద్ధంగానే వైరస్‌కు చెక్‌ పెట్టొచ్చని చెప్పారు.మూడు రకాల కొత్త పధ్దతుల్లో వ్యాక్సిన్ అభివృధ్దిపై కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండ్రస్ట్రియల్ రీసెర్చ్ సెంటర్ ప్రయోగాలు చేస్తోందని రాకేశ్ మిశ్రా చెప్పారు. సూడో వైరస్ పై సీసీఎంబీ ప్రయోగాలు చేస్తోందన్నారు. టెక్నాలజీ అభివృధ్ది చేశాక ఫార్మా సంస్ధలతో కలిసి ఉత్పత్తి చేసేందుకు అరబిందో, భారత్ బయోటెక్ సంస్ధలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని వివరించారు.

ఇండియాలో డిసెంబర్ నాటికి మొదటి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి!


కరోనా బాధితులపై ప్రయోగిస్తున్న ఔషధాలు ప్రభావవంతంగా పని చేయని నేపధ్యంలో సంప్రదాయ వైద్య పరిజ్ఞానాన్ని పరీక్షించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కాగా పుట్టగొడుగుల్లో కరోనాను చంపే గుణాలున్నట్లు గుర్తించినట్లు, వైరస్ లోడు తగ్గడం గుర్తించామని సీసీఎంబీ అటల్ ఇంక్యుబేషన్ కేంద్రం సీఈవో డాక్టర్ మధుసూధన్ తెలిపారు.


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *