వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో కరోనా బాధితుడు మృతి..భార్య ఓడిలోనే ప్రాణాలు కోల్పోయాడు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అనంతపురం జిల్లా వెలుగోడు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి అయింది. ధర్మవరానికి కేతిరెడ్డి కాలనీకి చెందిన ఓ వ్యక్తి కరోనాతో బాధపడుతూ తెల్లవారుజామున 3 గంటలకు అనంతపురం ఆస్పత్రికి వెళ్లాడు.

ఊపిరి ఆడటం లేదు. కాపాడాలంటూ సిబ్బందిని ప్రాధేయపడ్డాడు. సిబ్బంది పట్టించుకోకపోవడంతో నరకయాతన అనుభవించాడు. చివరికి ఆయాసంతో భార్య ఓడిలోనే భర్త ప్రాణాలు కోల్పోయాడు. తర్వాత వచ్చిన సిబ్బంది మృతదేహంపై రసాయనాలు స్ప్రే చేసి మార్చురీకి తరలించారు.

అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా బాధితుడు మృతి చెందిన ఘటనపై జిల్లా కలెక్టర్ చంద్రుడు పేషెంట్ ను మొదట ప్రైవేట్ ఆస్పత్రులకు తీసుకెళ్లారని అయితే ఎక్కడా కూడా అడ్మిట్ చేసుకోకపోవడంతో చివరకు గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు విచారణలో తేలిందన్నారు. వెంటనే వైద్యం అందించే ప్రయత్నం చేసినా అప్పటికే ఆలస్యం కావడంతో చనిపోయినట్లు వివరించారు.

పూర్తి విచారణ జరిపి వైద్యులు, సిబ్బంది నిర్లక్ల్యం ఉంటే చర్యలు తీసుకుంటామని అనంతపురం జిల్లా కలెక్టర్ చంద్రుడు అన్నారు. ఆస్పత్రిలో సిబ్బంది పట్టించుకోకపోవడం వల్లే చనిపోయాడంటూ మృతుడి బంధువులు ఆరోపింంచారు. అయితే ఆస్పత్రిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వైద్యుల నిర్లక్ష్యం ఏమీ లేదని తెలిపారు.

Related Posts